రఫ్ఫాడించిన రెబల్ రెజీనా

0

పాత ఆల్టో 800 ఆలోచనలకు చెక్ పెట్టి కొత్త ఆల్ట్రోజ్ ఐ20 ఆలోచనలతో చెలరేగిపోతోంది యూత్. ఏం చేసినా సంథింగ్ కిక్కుండాలి. పోష్ గా లగ్జరీగా కిరాక్ పుట్టించాలి. ఇదిగో ఇక్కడ నవతరం కథనాయిక రెజీనాను చూస్తుంటే ఆ విషయం ఇట్టే అర్థమైపోతోంది.

2020 ఆల్ట్రోజ్ వర్సెస్ ఐ 20 కాంపిటీషన్ లా చెలరేగిపోతోంది. నవతరం కథానాయికలంతా ఎవరికి వారు సరికొత్త ఫోటోషూట్లతో దూసుకొస్తుంటే పోటీబరిలో నేనేమైనా తక్కువా? అన్నంతగా చెలరేగింది రెజీనా.

బ్రిటన్ మహారాణికి జెరాక్స్ కాపీలా.. రెబల్ రాణికి ఐకన్ సింబల్ లా రెజీనా లుక్కు చూడగానే పరేషాన్ అయిపోతున్నారంతా. సోషల్ మీడియాల్లో లేటెస్టుగా రెజీనా షేర్ చేసిన ఫోటోషూట్ అదరగొడుతోంది. రకరకాల భంగిమల్లో వెరైటీ దుస్తుల్లో ఈ యువనాయిక దుమారమే రేపింది. సూట్ లో పోష్ లుక్ లో రెబల్ స్టైల్లో కనిపించినా… ఈస్ట్ మన్ కలర్ లో వైన్ గ్లాస్ చేత పట్టి సేవిస్తున్న ఫోజిచ్చినా… పిక్కల పైకి కార్పొరెట్ షార్ట్ ధరించినా రెజీనా ఇస్టయిల్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. మైండ్ బ్లోయింగ్ అని ఫీలయ్యేవాళ్లకే మైండ్ బ్లాక్ అవ్వాలంతే.

రొటీన్ లవ్ స్టోరితో తెలుగు తెరకు పరిచయమై మెగా కాంపౌండ్ సినిమాల్లో నటించింది. అయితే ఆశించినంత రేంజుకు కెరీర్ ని జంప్ చేయించడంలో తడబడింది. ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ఈపాటికే రిలీజ్ కావాల్సినవి వాయిదా పడ్డాయి. చక్ర-కల్లాపార్ట్ -కసడతపర అనే చిత్రాల్లో రెజీనా నటిస్తోంది.