సెల్ఫీలో కూడా హొయలొలికిస్తున్న రత్తాలు..!

0

గ్లామర్ బ్యూటీ రాయ్ లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ బాషలలో మెరిసింది లక్ష్మిరాయ్. లక్ష్మిరాయ్ పేరుతో ఉంటే హిట్స్ రావట్లేదని తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. కానీ ఎన్ని చేసినా అమ్మడి కెరీర్ లో మార్పు రాలేదు. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగుతెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ.. సినిమాల పరంగా కాస్త నిరుత్సాహంగానే ఉందని చెప్పాలి. ఎంత గ్లామర్ ఒలికించినా ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన గురించి.. తన సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. ఇక అందాల ప్రదర్శన అంటారా.. అది అమ్మడికి కొట్టిన పిండితో సమానం.

తెలుగులో సినిమాలు తక్కువ చేసిన ఈ భామ ఐటమ్ సాంగ్స్ మాత్రం బాగానే చేసింది. మెగాస్టార్ సరసన రత్తాలు పాటతో ఊపు ఊపి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన తోబతోబ పాటలో చిందేసింది. రెండు పాటలు మంచి హిట్స్. కానీ ఏం చేసిన లక్ష్మికి ఐటమ్ సాంగ్స్ తప్ప సినిమా అవకాశాలు కరువే అయ్యాయి. హిందీలో జూలీ-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఏకంగా ఫస్ట్ టైం బికినీ కూడా ధరించింది. లక్ష్మి హొయలు చూసి కుర్రకారు ఊరుకుంటారా.. ఓ రేంజిలో లక్ష్మి గురించి కలలు కంటున్నారు. తాజాగా అమ్మడు ఒక సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో లక్ష్మి తన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మెరిసే మేనిఛాయతో అందమైన కళ్ళతో.. వేడెక్కించే క్లీవేజ్ అందాలతో మురిపిస్తుంది. ఈ వయ్యారి భామ వయ్యారాలు చూస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.