Templates by BIGtheme NET
Home >> Cinema News >> RED డిజిటల్ ఒప్పందంలో ఏమిటా మతలబు

RED డిజిటల్ ఒప్పందంలో ఏమిటా మతలబు


పెద్దతెర రిలీజ్ కోసం ఓపిగ్గా వేచి చూసి.. చివరికి విసిగి వేసారి ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. నాని-సుధీర్ బాబు `వి` ఈ కేటగిరీలోనే రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా అరడజను సినిమాలు ఈ కేటగిరీలోనే రిలీజవుతున్నాయి. అయితే రామ్ రెడ్ మాటేమిటి? ఇంతకీ ఓటీటీలో వస్తుందా? రాదా? అంటే ఇప్పటికి ఇంకా సస్పెన్స్ అనే భావిస్తున్నారు.

రామ్ చిత్రం RED డీల్ ఇతర ఒప్పందాలతో పోలిస్తే డిఫరెంట్. నిర్మాతలకు డిజిటల్ కంపెనీకి మధ్య ఒక ఆసక్తికరమైన డిజిటల్ ఒప్పందం జరిగింది. ఇప్పటికి హిందీ డబ్బింగ్ హక్కులు.. తెలుగు శాటిలైట్ హక్కులను విక్రయించారు. ఆ మేరకు నిర్మాత ఇప్పటికే పెద్ద మొత్తాలను జేబులో వేసుకున్నారట.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా చాలా వరకూ సేఫ్. కానీ థియేట్రికల్ రిలీజ్ తో వచ్చే కిక్కును దృష్టిలో ఉంచుకుని ఓటీటీ-డిజిటల్ రిలీజ్ ఒప్పందంలోనే ఏదో మతలబు పెట్టారన్న గుసగుసా వినిపిస్తోంది. ఇంతకీ అదేమిటీ? అన్నది ఆ హీరో కానీ.. నిర్మాత కానీ ఓపెన్ గా చెబితేనే క్లారిటీ వస్తుంది.

స్రవంతి మూవీస్ బ్యానర్ అంటే రామ్ కి సొంత బ్యానర్. ఆ మమకారంతోనే థియేట్రికల్ రిలీజ్ కి పట్టుబడుతున్నాడట. పైగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాని పెద్ద తెరపై వీక్షిస్తేనే బావుంటుందనేది రామ్ ప్లాన్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే కోవిడ్ అన్నిటినీ నాశనం చేసింది. కానీ ఇంకా ఓపిగ్గానే వేచి చూస్తున్నారు చిత్రబృందం. RED కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా ఉండనుంది. ఈ సొగసైన యాక్షన్ ఎంటర్ టైనర్లో నివేదా పెతురాజ్ -మాళవికా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.