Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘రెడ్’ ని లైట్ తీసుకోవడం లేదు కదా..!

‘రెడ్’ ని లైట్ తీసుకోవడం లేదు కదా..!


ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ”రెడ్”. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ – నివేథ పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రామ్ ‘రెడ్’ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే రామ్ మాత్రం థియేటర్స్ లోనే సినిమాని విడుదల చేయాలని వెయిట్ చేసాడు.

థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో ‘రెడ్’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కి రెడీ చేసుకున్నారు. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పటికీ ఇంతవరకు తేదీని ప్రకటించలేదు. దీంతో అసలు ‘రెడ్’ పండుగ సీజన్ లో వస్తుందా రాదా అని డౌట్ పడుతున్నారు. ఇదిలా ఉంటే ‘రెడ్’ విషయంలో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని.. అందుకే మేకర్స్ సైలెంటుగా ఉంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ ఉంటే మాత్రం ఇప్పటి నుంచే ఏదొక అప్డేట్ తో ప్రమోషన్స్ చేయకపోతే ‘రెడ్’ మీద జనాలకి ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వైఏదేమైనా గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ఈసారి ‘రెడ్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ని కొల్లగొడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.