Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎంత లేట్ అయినా థియేటర్స్ లోనే…!

ఎంత లేట్ అయినా థియేటర్స్ లోనే…!


కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. గత ఐదు నెలలుగా థియేటర్లన్నీ మూత పడి ఉన్నాయి. దీంతో చాలా సినిమాల విడుదల ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో అనే దానిపై క్లారిటీ లేకపోవడంతో కొందరు మేకర్స్ తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’ సినిమాని సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఓటీటీతో డీల్ సెట్ చేసుకోవడంతో ఇప్పుడు మిగతా ప్రొడ్యూసర్స్ గా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని కొత్త చిత్రం ‘రెడ్’ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోందని వార్తలు వచ్చాయి.

అయితే రామ్ మాత్రం థియేటర్స్ తెరుచుకునే వరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. గతేడాది రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు అతని కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ‘రెడ్’ సినిమాతో ఆ జోష్ ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తన సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని రామ్ అంటున్నాడట. అందులోనూ ఈ చిత్రాన్ని రామ్ హోమ్ బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. అందరు ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రాకూడదనే ఉద్దేశ్యంతో తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కానీ రామ్ ‘రెడ్’ హోమ్ బ్యానర్ లో తెరకెక్కిందే కావడంతో ఫైనాన్సియల్ ప్రెజర్ కూడా ఉండకపోవచ్చని.. ఎంత లేట్ అయినా థియేటర్స్ లోనే రావాలని రామ్ ఫిక్స్ అయ్యాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రామ్ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.