రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా…?

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ మరియు ఈడీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుశాంత్ మరణంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఇక ఈ కేసు విషయంలో ముంబైలో సీబీఐ మరియు ఈడీ అధికారులు భేటీ అయ్యారని సమాచారం. సీబీఐ ఇప్పటికే సుశాంత్ సింగ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని.. వంట మనిషి నీరజ్ సింగ్.. దీపేష్ సావంత్ ను ముంబైలోని డీఆర్డీడీవో గెస్ట్ హౌస్ లో ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే నేషనల్ మీడియా ఛానళ్లు కూడా ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో రోజుకొక కొత్త విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్స్ మరియు నార్కోటిక్స్ తో లింకులు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా సుశాంత్ సింగ్ కేసులో మాదక ద్రవ్యాల అంశం మీడియా వర్గాల్లో ఆసక్తిని రేపింది. రియాకు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలున్నాయని ఈడీ అధికారులకు ఓ సాక్షి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమై దానికి సంబంధించిన సాక్ష్యాలు లభిస్తే రియా కచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇంతకముందు సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్ ‘రియాతో కలిసి సుశాంత్ తరచుగా గంజాయి సిగరెట్స్ తీసుకునేవాడని’ సంచలన విషయం చెప్పినట్లు మీడియాలో న్యూస్ వచ్చింది. దీనిని బట్టి చూస్తే రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు త్వరలోనే రియా చక్రవర్తిని సుదీర్గంగా చర్చించే అవకాశం ఉంది.