మెగా ప్రాజెక్ట్ నుంచి అతన్ని అందుకే తప్పించారట…!

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికే సుజీత్ మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు కూడా చేసాడని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ‘లూసిఫర్’ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ పక్కకు వెళ్లి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ వచ్చి చేరాడు. కొన్ని నెలల పాటు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన సుజిత్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తెప్పించారనే దాని మీద క్లారిటీ లేదు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇటీవల వివాహం చేసుకున్న సుజీత్ తన దగ్గరకు వచ్చాడని.. ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టలేక పోవడంతో తనను మన్నించమని కోరినట్లు చిరు వెల్లడించాడట. దానికి తాను అంగీకరించినట్లు.. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ బాధ్యత వినాయక్ తీసుకున్నాడని చిరంజీవి పేర్కొన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా చిరంజీవితో ‘ఠాగూర్’ ‘ఖైదీ నెం.150’ వంటి రెండు సక్సెస్ ఫుల్ రీమేక్స్ ఇచ్చిన వీవీ వినాయక్.. ఇటీవలే బెంగుళూరులో ఫైనల్ స్క్రిప్ట్ మెగాస్టార్ కి చెప్పాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకున్నారు. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.