ఎయిటీస్ తారల్లాగా.. బుల్లితెర నటీనటుల రీయూనియన్

0

స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకో ఇన్ స్టా మాధ్యమం.. దాంతో పాటే వెబ్ మాధ్యమం రెండూ లైవ్ లో చాలా విషయాలు చెబుతున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చేది తక్కువే. పరిమితంగా తక్కువ మందికే ఇది తెలుసు. అయితే తాజా పరిణామం చూస్తుంటే… తెలుగు బుల్లితెర ఆర్టిస్టులందరినీ ఏకం చేస్తూ సోషల్ మీడియా డిజిటల్ మాధ్యమాలు ప్రచారం హోరెత్తనుందని అర్థమవుతోంది.

బుల్లితెర ఆర్టిస్టుల్లో హేమ- సురేఖ వాణి- సరిత- రాజా రవీంద్ర తదితరులు ఇదిగో ఇలా ఫోటోకి ఫోజిచ్చారు. బుల్లితెర ఆర్టిస్టుల రీయూనియన్ సమావేశం కోసం ముందస్తు ప్రిపరేషన్ లో ఉన్నారని అర్థమవుతోంది. ఇకపై ప్రతియేటా పెద్దతెర ఎయిటీస్ తారల రీయూనియన్ లాగా బుల్లితెర రీయూనియన్ కూడా ఉంటుందట. సీనియర్ ఆర్టిస్టుల రీయూనియన్ అంటూ క్యాప్షన్ ఇస్తూ రివీల్ చేసిన ఈ ఫోటో కలర్ ఫుల్ గా ఉంది మరి. పెద్దతెర ఆర్టిస్టులకు ఉన్నట్టే ఈ బుల్లితెర ఆర్టిస్టులకు కూడా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. వీళ్లే సినిమాల్లో నటిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వోన్ చేసుకుంటారు కూడా.

ఫేవరెట్ హీరోలు ఫేవరెట్ హీరోయిన్లు అని అంటారు. కానీ మీ కుర్రాళ్లందరూ సూపర్ గా సర్ ప్రైజింగ్ గా ఉన్నారు. ఒకరికొకరు సపోర్ట్ లేకుండా ఏదైనా ఒక చిత్రం కానీ సీరియల్ కానీ అంత విజయవంతం కాదు. అన్నివిధాలా మంచి ఆరోగ్యం.. సంపద ఆనందం కలగాలంటే ఐక్యంగా ఉండాలి అంటూ సూచించాడో నెటిజనుడు. బుల్లితెర తారలంతా కలిసి కట్టుగా ఉండాలని వీర ఫ్యాన్ నివేదించాడు. మొత్తానికి బుల్లితెర తారల అభిమానులకు ఇవన్నీ ఆసక్తిని రేకెత్తించేవి అనే చెప్పాలి.