Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆర్జీవీ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘డేంజరస్’ ఫస్ట్ లుక్…!

ఆర్జీవీ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘డేంజరస్’ ఫస్ట్ లుక్…!


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విపత్కర సమయంలో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుంటూ సినిమాగా రూపొందిస్తున్నాడు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి వరుసగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ”క్లైమాక్స్” ”నగ్నం” ”పవర్ స్టార్” అనే సినిమాలను విడుదల చేసిన ”మర్డర్” ”థ్రిల్లర్” మూవీస్ ని రిలీజ్ కి రెడీ చేశారు. వీటితో పాటు ఫిక్షనల్ రియాలిటీ అనే కొత్త జోనర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ”ఆర్జీవీ మిస్సింగ్” ”అల్లు” అనే సినిమాలు అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో నా కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం అంటూ ”డేంజరస్” అనే మూవీ అనౌన్స్ చేసారు.

కాగా ఆర్జీవీ బ్యూటీస్ అప్సర రాణి మరియు నైనా గంగూలీ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ”డేంజరస్” మూవీ ఓ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రకటించాడు. దీనికి ”వారి ఎఫైర్ కాప్స్ మరియు గ్యాంగ్ స్టర్స్ తో సహా చాలా మందిని చంపింది” అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. ‘డేంజరస్’ అనేది అప్సర రాణి మరియు నైనా గంగూలీ అనే ఇద్దరు మహిళల మధ్య ఉద్వేగభరితమైన హై ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ అని వెల్లడించారు. అంతేకాకుండా ఇది ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చాడు. తాజాగా ”డేంజరస్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు వర్మ. ”హానరబుల్ సుప్రీంకోర్టు సెక్షన్ 377 ను రద్దు చేసిన తరువాత ఎల్జిబిటి ఎలివేట్ చేయడానికి ఇండియాలో రూపొందిస్తున ఫస్ట్ సినిమా ”డేంజరస్”.. న్యూ ఏజ్ ఇండియన్ సినిమాకి మార్గదర్శకత్వం వహించిన అప్సర రాణి మరియు నైనా గంగూలీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని వర్మ ట్వీట్ చేసారు. ఈ పోస్టర్ లో అప్సర రాణి మరియు నైనా గంగూలీలు లిప్ లాక్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. మొత్తం మీద ఈ లాక్ డౌన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ ఎవరూ ఊహించని కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తూ సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడని చెప్పవచ్చు.