ఆర్జీవీ మిస్సింగ్ లో అక్యూజ్డ్ నెం. 3 అండ్ 4

0

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఆర్జీవీ మిస్సింగ్”. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో రానుంది. సినిమా పబ్లిసిటీ విషయంలో డిఫరెంట్ గా ఆలోచించే వర్మ.. ఈ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు. రోజుకొక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే మూడు పోస్టర్స్ విడుదల చేసిన ఆర్జీవీ.. మొదటి దాంట్లో వర్మ చేతులకు బేడీలు వేసుకొని కనిపించాడు. ఆ తర్వాత పవర్ ఫుల్ స్టార్ పీకే అంటూ పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని మొదటి నిందితుడిగా పరిచయం చేశాడు. అలానే థర్డ్ పోస్టర్ లో రెండో నిందితుడిగా ఒమేగా స్టార్ ని చూపించాడు. ఈ క్రమంలో ఆర్జీవీ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసాడు.

కాగా ఈ పోస్టర్ లో మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడిని పోలిన వ్యక్తులను అక్యూజ్డ్ నెం. 3 మరియు 4 అంటూ పరిచయం చేశాడు. తండ్రికి తనయుడు దండం పెడుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో టీవీలో ‘ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ – మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులు’ అని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా చూపించాడు. రేపు సాయంత్రం 5 గంటలకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని వర్మ ప్రకటించాడు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఇంతకముందు చెప్పినట్లు WHY S జగన్ – KCAR – KTAR లుక్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. వర్మ క్రియేట్ చేసిన ‘ఆర్జీవీ మిస్సింగ్’ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.