ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నుంచి వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. యధార్థ సంఘటనల ఆధారంగా కథలను సిద్ధం చేసుకుంటూ ఆయన దూసుకెళుతున్నాడు. అలా ఓ పరువు హత్యకి సంధించిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఆయన ‘మర్డర్’ సినిమాను రూపొందించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను కృష్ణస్వామి శ్రీకాంత్ పోషించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు.
“లాక్ డౌన్ కాలంలో నెల రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయాను. బయటికి వెళ్లి ఏం చేయకపోతే ఎట్లా అనే ఆలోచనలో నేను ఉన్నప్పుడు నాకు వర్మగారు కాల్ చేశారు. ‘మర్డర్’ సినిమాను చేస్తున్నట్టుగా చెప్పారు. ఆ సినిమాలో ఆయన నాకు అవకాశం ఇవ్వడం .. నా కుటుంబాన్ని నేను పోషించుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఫిజికల్ గా .. మెంటల్ గా నన్ను బాగా డిస్టబ్ చేసింది. ఒక సీన్ లో వర్మకి కావలసిన అవుట్ పుట్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను. అదేమిటనేది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.
‘మర్డర్’ సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా చేసిందని అంటున్నారు .. ఆ విషయాలను గురించి వర్మను నేను వివరంగా అడగలేదు. ఆ కథకు కారణమైన కుటుంబాలను నేను కలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. నేను ఒక నటుడిని .. దర్శకుడు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడమే నా పని .. అదే చేశాను. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. వీలైనప్పుడల్లా కొత్త సినిమాలు చూస్తూనే ఉంటాను. తెరపై నాకు నచ్చిన పాత్రలు కనిపించినప్పుడు ఆ పాత్రలను నేను చేస్తే బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటాను. నిజం చెబుతున్నాను .. నాకు అన్నిరకాల పాత్రలను చేయాలని ఉంటుంది .. చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు .. హీరోయిన్ పాత్రలు తప్ప” అంటూ నవ్వేశాడు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
