అప్పటి నుండే సుశాంత్ ఆరోగ్యం క్షీణించింది : రియా

0

సుశాంత్ మృతి తర్వాత అందరి దృష్టి ఇప్పుడు రియాపైనే పడింది. ఆమె వల్ల సుశాంత్ చనిపోయాడు అంటూ కొందరు.. ఆమె సుశాంత్ ను చంపేసి ఉంటుందని కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రియా కూడా తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సుశాంత్ ఆరోగ్య పరిస్థతి సరిగా లేదని ఆయన డిప్రెషన్ కు గత ఆరు సంవత్సరాలుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో ఆమె ఇంకా మాట్లాడుతూ… గత ఏడాది అక్టోబర్ లో మేము యూరప్ టూర్ వెళ్లాము. టూర్ వెళ్లడానికి ముందు సుశాంత్ చాలా ఇబ్బందిగా అనారోగ్యంతో కనిపించే వాడు. అక్కడకు వెళ్లిన మూడు రోజుల వరకు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత చాలా మారాడు. రోడ్లపై గంతులు వేయడం చాలా ఉల్లాసంగా మాట్లాడటం చేసేవాడు. ఆ సమయంలో సుశాంత్ ను చూస్తే చాలా సంతోషం వేసింది. మా పర్యటన చాలా బాగానే సాగింది. అలాంటి సమయంలో మేము ఇటలీలోని గోతిక్ హోటల్ కు మారాం. అక్కడ మాకు ఒక గుహ లాంటి రూంను ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. అయితే సుశాంత్ రూం మారడం కష్టం అంటూ దాన్ని కంటిన్యూ చేశాడు.

సుశాంత్ కు మొదటి నుండి ఇరుకుగా ఉండే ప్రదేశాలన్నా.. గుహలు లేదా ఇసుక ప్రాంతాలు అన్నా కూడా భయం. అక్కడ ఆయన మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటాడు. ఆ రూంకు వెళ్లక ముందు వరకు బాగానే ఉన్న సుశాంత్ ఒక రాత్రి అక్కడ పడుకున్న తర్వాత వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అప్పుడే నేను డిప్రెషన్ తో బాధపడుతున్నాను 2013 నుండి హరేష్ శెట్టి అనే వైధ్యుడి వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. అతడు ఇచ్చిన మందులను వేసుకుంటున్నట్లుగా చెప్పాడు. ఆ రూంకు వెళ్లినప్పటి నుండి సుశాంత్ మానసిక పరిస్థితి క్షీణించిందని రియా పేర్కొంది.