ఇలా కనిపిస్తేనే జనాకర్షణా.. సారా జిమ్మిక్!?

0

నెలల తరబడి స్వీయ నిర్బంధం తరువాత సెలబ్రిటీలు చివరకు మానసికంగా సాధారణ స్థితికి చేరుకుని ఆరుబయట షికారుకు వస్తున్నారు. షూటింగులు తిరిగి ప్రారంభించడం ఇంకా కష్టమే కానీ.. చిన్నా చితకా పర్సనల్ పనులకు మాత్రం భయపడడం లేదు. ఇంకా ఎన్నాళ్లని ఇంట్లోనే కూచోవడం అనుకుందో ఏమో.. ఇదిగో పటౌడీ వారసురాలు సారా అలీఖాన్ ఇలా షూటింగులకు రెడీ అయిపోయింది.

వస్తే వచ్చింది కానీ.. ఇస్టయిల్ చూశారా? చూస్తే ఇక అంతేగా.. నటవారసురాలి థైషోస్ చూసి పరేషాన్ అయిపోవడం కుర్రకారు వంతు అయ్యింది మరి. ఎర్ర పరికిణీలో దుమారం రేపిన సారాను నిశితంగా చూస్తే.. థై అందాల పైకి అలా తేలిపోయేలా డిజైన్ ఎందుకు? అని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. మరోసారి అలా ఆరు బయట కనిపించినప్పుడు పొట్టి నిక్కరులో థై షోస్ చేసింది.

అన్నట్టు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఇలాంటివి ఓకే కానీ.. ఆరుబయట అవసరమా? అనే ప్రశ్న చాలాసార్లు ఎదురవుతుంటుంది. తాజాగా మెహబూబ్ స్టూడియోలో ఆమె రెండు వేర్వేరు వేషధారణలతో ది బెస్ట్ గానే కనిపిస్తోంది. ఇంతకుముందు లాక్ డౌన్ లో ఆరుబయట షోలకు స్టూడియోలో సెట్స్ లో షోలకు ఏమాత్రం తేడానే లేదు మరి.

ఒక గెటప్ లో పోల్కా-చుక్కల మినీ డ్రెస్ ఎరుపు రంగు దుస్తులు ఆమె నడుము అందాన్ని ఇనుమడింపజేసింది. పూల ముసుగు హెడ్బ్యాండ్ ఆమె రూపానికి జోడించడం హైలైట్. వేరొక చోట ఆమె వ్యాన్ వైపు కదిలి వస్తూ.. మరొక డిజైనర్ డ్రెస్ లో కనిపించింది. బ్లాక్ షార్ట్ – వైట్ టాప్ లో చెలరేగిపోతోంది ఈ గెటప్పులో.