తల్లి ఫోన్ తో రియా చాటింగ్?

0

సుశాంత్ ఆత్మహత్య విషయంలో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అతడి ప్రియురాలు రియా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా కీలక విషయాలు బయటపెట్టినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

డ్రగ్స్ గురించి రియా చాట్ చేసేందుకు తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ ను ఉపయోగించినట్టు ఎన్.సీ.బీ విచారణలో బయటపడినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. తల్లి ఫోన్ ద్వారానే రియా తన స్నేహితులతో సంప్రదింపులు జరిపేదని.. మరెన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోన్ ద్వారా ఆమె కనెక్ట్ అయ్యి ఉందని తమకు సమాచారం అందినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది.

ఎన్.సీ.బీ అధికారులకు రియా తన సొంత ఫోన్ ను అప్పగించిందని.. ఆమె తల్లి ఫోన్ ను అప్పగించలేదని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో రియా ఆమె సోదరుడు షోవిక్ సంబంధించిన చాట్స్ బయటపడ్డాయి. రియా తల్లి సంధ్యా చక్రవర్తి ఫోన్ వాట్సాప్ గ్రూపులో ఉన్న పలువురిపై ఎన్.సీ.బీ దృష్టి సారించినట్లు సమాచారం.

ప్రస్తుతం రియాతో డ్రగ్స్ గురించి చాట్ చేసిన పలువురిని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రియా సహా షోవిక్ సుశాంత్ మేనేజర్ శామ్యూల్ పెట్టుకున్న బెయిల్ ను ముంబై కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 22 వరకు ఎన్.సీ.బీ అదుపులో వీరు ఉండనున్నారు.