హైదరాబాద్ లో ప్లాట్ కొనేసిన మరో బ్యూటీ

0

తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. వారిలో చాలా మంది తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన వెంటనే హైదరాబాద్ లో సెటిల్ అయ్యేందుకు ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో చాలా మందికి హైదరాబాద్ లో సొంత ప్లాట్స్ ఉన్నాయి. వారు ఎక్కవ మంది హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్లే. సినీ కెరీర్ తర్వాత కూడా వారు ఇక్కడే సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

తాజాగా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పూత్ కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పూర్తిగా టాలీవుడ్ సినిమాలు చేస్తూ ఇక్కడే ఉండి పోవాలనుకుంటున్నట్లుగా ఆమె సన్నిహితుల వద్ద చెబుతుందట. ఇప్పటికే హైదరాబాద్ లోని ఒక ఖరీదైన ఏరియాలో అపార్ట్ మెంట్ లో ప్లాట్ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. పాయల్ హీరోయిన్ గా మొదటి సినిమాతో ఆకట్టుకున్నా ఆ తర్వాత సినిమాలతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోతుంది. అయినా కూడా ఆమెకు ఆఫర్లు అయితే వస్తున్నాయి. త్వరలో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.