రియాను హనీ ట్రాప్ గా ఉపయోగించారు: నటి

0

బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మృతి వెనుక డ్రగ్స్ ములాలు బయటపడడంతో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా ఈ కేసులో అరెస్ట్ అయ్యింది. మరో నలుగురు కూడా జైలు పాలయ్యారు.

తాజాగా ఈ కేసులో మరో కీలక సమాచారం వెలుగుచూసింది. డ్రగ్స్ కేసులో రియాను హనీ ట్రాప్ గా ఉపయోగించారని.. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని బాలీవుడ్ నటి అంకిత లోఖండేల సన్నిహితురాలైన బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ కు స్లో పాయిజన్ కూడా ఇచ్చారని సదురు నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓ ఇంగ్లీష్ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంచలన విషయాలను బాలీవుడ్ నటి వెల్లడించారు. బాలీవుడ్ డ్రగ్ మాఫియానే సుశాంత్ ను బలిగొందని.. తాను కూడా ఈ డ్రగ్ పెడ్లర్ల బాధితురాలినే అని ఆమె చెప్పింది. అదృష్టవశాత్తూ దీని నుంచి బయటపడ్డానని.. తన జీవితంలో ఇది ఒక భయంకరమైన దశ అని ఆమె పేర్కొన్నారు.

నేను కూడా ఒకప్పుడు అదే డ్రగ్స్ ముఠా బాధితురాలిగా ఉన్నానని.. బాలీవుడ్ రెండవ పేరు ‘డ్రగ్’ అని బాలీవుడ్ నటి మీడియాకు తెలిపింది. ఈ డ్రగ్ ముఠా చాలా పెద్దదని.. పరిశ్రమలో పెద్ద పెద్ద లింకులు ఉన్నాయని సదురు నటి తెలిపింది. పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఈ సందర్భంగా నటి గుర్తు చేసుకున్నారు.

బాలీవుడ్ లోకి వచ్చిన కొత్తలో ఓ పార్టీకి వెళ్లానని.. అప్పుడు డ్రగ్ తీసుకోకపోతే నిన్ను వెలివేస్తామని నటీనటులు చెప్పారని సదురు నటి తెలిపింది. బాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకోవడం ట్రెండ్ గా ఫాలో అవుతారని ఇది తీసుకోకపోతే వింతగా చూస్తారని ఆమె తెలిపింది.

పార్టీలలో డ్రగ్స్ ను విచ్చలవిడిగా వాడుతారని.. వీటి సరఫరా కోసం పెద్ద పెద్ద డీలర్లు పెడ్లర్ లు ఉన్నట్టు బాలీవుడ్ నటి తెలిపింది. ఈ ముఠాకు సంబంధించిన ప్రధాన వ్యక్తిని ఎవరూ చేరుకోలేరని ఆమె తెలిపింది.