మేం ముగ్గురం కాబోతున్నాం.. ప్రకటించిన హీరోయిన్!

0

‘రిచా గంగోపాధ్యాయ..’ 2010లో ‘లీడర్’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఈ చిత్రం తర్వాత మిరకాయ్ మిర్చి సారొచ్చారు వంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రిచా. అయితే.. ఆ తర్వాత కొద్దికాలంలోనే నటనకు గుడ్ బై చెప్పిందీ బ్యూటీ.

2013 లో యాక్టింగ్ కు పర్మనెంట్ గా ప్యాకప్ చెప్పేసి యుఎస్ వెళ్లిపోయింది. ఈ మధ్య తన బిజినెస్ స్కూల్ క్లాస్మేట్ జో లాంగెల్లాను వివాహం చేసుకుంది. అయితే.. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానంటూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ న్యూస్ చెప్పేసింది రిచా.

ఈ మేరకు ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో గర్భాన్ని చూపిస్తుండగా.. తన భర్త జో రిచాను ముద్దు పెట్టుకుంటున్నాడు. ‘ఈ విషయం మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. బేబీ లాంగెల్లా ఈ జూన్ లో రాబోతున్నారు. అప్పటి వరకూ వెయిట్ చేయలేకపోతున్నాం’ అని రాసుకొచ్చింది రిచా. సోషల్ మీడియాలో ఈ పోస్టు చూసిన అభిమానులు హర్షం ప్రకటిస్తున్నారు. బీ హ్యాపీ ఆల్వేస్ అంటూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.