సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది.

సుశాంత్ చనిపోయాడని తెలియగానే షాక్ కు గురయ్యా.. ఏం జరిగిందో అర్థం కాలేదు. మార్చురీ దగ్గరకు వెళ్లాను. అక్కడ తనను రానీయలేదు. కేవలం సుశాంత్ శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు 3-4 సెకండ్లు మాత్రమే చూశాను అంటూ రియా వాపోయింది. నా స్నేహితులు వారిని ప్రాధేయపడ్డా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక సుశాంత్ మరణం తనను కలిచివేసిందని ‘సారీ బాబు’ అంటూ రియా వాపోయింది. తను మరణించాడని.. జీవితాన్ని కోల్పోయాడని.. కానీ అతడి మరణాన్ని జోక్ లా చేశారని రియా ఆవేదన వ్యక్తం చేసింది. క్షమించమని కోరడం తప్ప నేను ఏమీ చేయలేనని.. అతడి పాదాలను తాకానని.. ఏ భారతీయుడైనా దీన్ని అర్థం చేసుకోవాలని రియా తెలిపింది.