Templates by BIGtheme NET
Home >> Cinema News >> #RRR ఆ యాక్షన్ సీన్స్ సెన్సేషన్ ఖాయం

#RRR ఆ యాక్షన్ సీన్స్ సెన్సేషన్ ఖాయం


దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి RRR కోసం రేయింబవళ్లు ఆలోచిస్తూ శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మల్టీస్టారర్ కోసం రాజమౌళి చాలా రిస్కులే చేస్తున్నారు.

రామ్ చరణ్.. రామారావు.. అజయ్ దేవగన్ .. ఆలియా.. ఒలీవియా లాంటి భారీ తారాగణంతో రియల్ అడ్వెంచర్ కి సిద్ధమైన జక్కన్న ఎలాంటి ఔట్ పుట్ తేనున్నాడు? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల చరణ్ .. తారక్ సహా నాయికలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించే ప్రయత్నం సాగుతోంది.

తాజాగా RRR నిర్మాణ సంస్థ DVV మూవీస్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో RRR యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ చిన్న వీడియో చూస్తే.. ఎంతటి భారీ కాన్వాసును ఈ మూవీ కోసం ఉపయోగిస్తున్నారు? అన్నది ఇట్టే అర్థమైపోతుంది. బ్లూమ్యాట్ గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ లో వందలాది సహాయక నటులను ఉపయోగించి యాక్షన్ సీక్వెన్స్ భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని స్పష్టమవుతోంది.

ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్ దేవ్గన్.. అలియా భట్.. ఒలివియా మోరిస్ .. సముతిరాఖని పాత్రలకు చాలా ప్రత్యేకత ఉంటుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ గగుర్పొడిచే రేంజులో చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే కొన్ని లీక్స్ కూడా అందాయి.