పక్కా బైక్ రేసర్ నే తలపిస్తున్న సుప్రీం హీరో

0

సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన తాజా చితరం `సోలో బ్రాతుకే సో బెటర్` ను అక్టోబర్ నాటికి టాకీ ముగించేసి దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న తన తదుపరి చిత్రం షూటింగుకి వెళ్ళారు. తాత్కాలికంగా ఈ మూవీ టైటిల్ `రిపబ్లిక్` అని పిలుస్తున్నారు. ప్రస్థానం తర్వాత మళ్లీ అంతటి ఎమోషనల్ కంటెంట్ తో సీరియస్ పొలిటికల్ డ్రామాతో మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

అయితే చిన్నపాటి గ్యాప్ లో సాయి తేజ్ ఇటీవల తన స్నేహితులతో బైక్ ట్రిప్ వెళ్ళాడు. అతను ఇన్ స్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశాడు. బైకర్ జాకెట్ .. గ్లోవ్స్ .. హెల్మెట్ ధరించి రహదారిపై ఆపి ఉంచిన ఖరీదైన ఇంపోర్టెడ్ బైక్ తో ఛాయాచిత్రల్ని రివీల్ చేశాడు. ఒక పక్కా బైక్ రేసర్ నే తలపిస్తున్నాడు ఈ లుక్ చూస్తుంటే.

“నాలుగు చక్రాలు శరీరాన్ని కదిలిస్తాయి.. రెండు చక్రాలు ఆత్మను కదిలిస్తాయి ” అన్న ఆసక్తికర క్యాప్షన్ ని ఈ ఫోటోకి ఇచ్చాడు. దీని అర్థం ఏమిటి? అంటారా.. నాలుగు చక్రాల బండి కంటే ఆత్మను కదిలించే శక్తి ద్విచక్రవాహనానికే ఉందని అర్థం. ఒళ్లు దగ్గర పెట్టుకుని నడపాల్సిన ఆవశ్యకత కూడా దీనికే ఎక్కువ. పైగా రైడింగ్ లో అడ్వెంచర్ అంటే ఆషామాషీ కాదు. అందుకే ఇంత జాగ్రత్తగా ప్రిపేరై సాయి తేజ్ బయల్దేరారన్నమాట.