క్యాప్ తో ప్రత్యక్షమయ్యారు.. ఏంటా మెగా సీక్రెట్?

0

ఇటీవల హైదరాబాద్ లో సంభవించిన అకాల వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. ఈ విపత్తు నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లకు మించి నిధుల్ని విడుదల చేసింది. దాతలు స్పందించాల్సిందిగా కోరింది. దీంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది వరద సాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము ప్రకటించిన మొత్తాన్ని సీఎం కేసీఆర్ కు అందించేందుకు చిరంజీవి.. నాగార్జున క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ హెయిర్ కనిపించకుండా బ్లూకలర్ క్యాప్ ధరించి కనిపించడం పలువురిని ఆలోచనలో పడేసింది. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని అందుకే జుట్టు కనిపించకుండా క్యాప్ పెట్టారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల రఘు కుంచె డాటర్ పెళ్లిలోనూ మెగాస్టార్ క్యాప్ తో కనపించారు. దీంతో ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారనే వాదనకు మరింత బలం చేకూరింది. ఈ రోజుల్లో హెయిర్ ప్లాంటేషన్ అన్నది సినీ తారలకు ఫ్యాషన్ గా మారింది. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే అది వారికి చాలా అవసరమైంది కూడా.

ఈ రోజుల్లో చాలా మంది సినీ దర్శకులు.. నిర్మాతలు .. నటులు విగ్స్ ఉపయోగిస్తున్నారు. కాని విగ్స్ వారికి పెద్ద తలనొప్పిగా మారాయి. కాబట్టి వారు హెయిర్ ప్లాంటేషన్ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. దర్శకుడు వి వి వినయక్ .. నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల హెయిర్ నేవింగ్ చేయించుకున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి పేరుగాంచిన ఒక అగ్ర దర్శకుడు కూడా తన బట్టతలని కప్పిపుచ్చడానికి ఈ పద్ధతిని అనుసరించాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.