Templates by BIGtheme NET
Home >> Cinema News >> #RRR : కల్పితం అంటున్నా వివాదం రాజేస్తున్నారు

#RRR : కల్పితం అంటున్నా వివాదం రాజేస్తున్నారు


రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుండి కొమురం భీమ్ ఫస్ట్ లుక్ మరియు థీమ్ వీడియోను విడుదల చేశారు. నాలుగు అయిదు నెలల క్రితం విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా వేశారు. ఎట్టకేలకు విడుదల అయిన రామరాజు ఫర్ భీమ్ వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కింది. అన్ని భాషల్లో కూడా ఈ వీడియోను విపరీతంగా ఆధరిస్తున్నారు. యూట్యూబ్ లో మంచి రికార్డు కూడా సొంతం చేసుకుంది. అద్బుతమైన స్పందన ఈ ప్రోమోకు మొదట కాపీ మరక అంటించారు. ఇప్పుడు ఆదివాసీలు వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసీల గోండు వీరుడు అయిన కొమురం భీమ్ పేరుతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూపించడం వరకు ఓకే కాని ఆయనను ముస్లీంగా చూపించడం ఏంటీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లీంగా కళ్లకు నల్లరంగు పెట్టుకుని ముస్లీం టోపీ ధరించడంతో చరిత్రను వక్రీకరించినట్లుగా అవుతుంది అంటూ కొందరు జక్కన్న టీం పై ఫిర్యాదుకు రెడీ అయ్యారు. ఉట్నూరు లోని కొమురం భీమ్ యువజన సంఘం నాయకులు ఈ విషయమై నిరసన తెలిపారు. నిజాంపై పోరాటం సాగించిన భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు.

మొదటి నుండి ఈ సినిమాలో హీరోల పాత్రలు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్లు మాత్రమే.. కథ మొత్తం పూర్తి విభిన్నంగా ఉంటుందని ఇది ఒక స్వాతంత్ర్య ఉద్యమ సినిమా కాదని చెప్పారు. అయినా కూడా చరిత్రను వక్రీకరిస్తున్నారు అంటూ వివాదం రాజేస్తున్నారు. ముందు ముందు మరెలాంటి వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతాయో చూడాలి.