అల్లు హీరోయిన్ మళ్ళీ ఎక్కడా కనిపించడం లేదుగా…!

0

ఆకతాయి అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ రుక్సార్ ధిల్లన్. అంతకుముందు ‘రన్ ఆంటోనీ’ అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రుక్సార్ బ్యూటీని చూసి తెలుగులో అవకాశాలు బాగానే వస్తాయని అనుకున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని డ్యూయల్ రోల్ లో నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఒక హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది రుక్సార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అమ్మడికి పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు.

అయినప్పటికీ మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ నటించిన ‘ఎబిసిడి’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం మలయాళ సక్సెస్ ఫుల్ మూవీ ‘ఏబీసీడీ’కి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగులో ప్లాప్ గా మిగిలిపోయింది. దీంతో రుక్సార్ కి పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి. ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టి ‘భాంగ్రా పా లే’ అనే సినిమాలో నటించింది. అక్కడ కూడా ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ బ్యూటీ లుక్స్ పరంగా బాగుండి తెలుగులో ఛాన్సెస్ రాకపోవడానికి నటించిన మూడు సినిమాలు పరాజయం చెందడం ఒక్కటే రీజన్ కాదని తెలుస్తోంది.

టాలీవుడ్ లో రుక్సార్ కి అవకాశాలు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఈ బ్యూటీ అడిగే రెమ్యూనరేషన్ అని అంటున్నారు. సినిమాకి దాదాపుగా 18 లక్షలు నుంచి 40 లక్షల వరకు అమ్మడు డిమాండ్ చేస్తుందట. అదే బడ్జెట్ కి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ వస్తారులే అని భావించిన చిన్న మీడియం రేంజ్ హీరోలు ఈ బేబీని దూరం పెట్టేశారు. అయితే ఈ మధ్య మాస్ మహారాజా రవితేజ.. యువ హీరో శర్వానంద్ అప్ కమింగ్ సినిమాల కోసం ఈ బ్యూటీని సంప్రదించారట. కారణాలేంటో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ అమ్మడిని వద్దు అనుకుంటున్నారట. మరి క్రైసిస్ టైంలో రేట్ తగ్గించుకుంటే చిన్న మీడియం రేంజ్ హీరోల సినిమాల ఆఫర్స్ దక్కే ఛాన్స్ ఉంది.