సూర్పణఖగా మారిన మన్మథుడి గాళ్ ఫ్రెండ్

0

ఎప్పుడూ గ్లామర్ క్వీన్ లాగా ఐటెమ్ గాళ్ లాగా కనిపిస్తే గుర్తింపు ఏం ఉంటుంది? పైగా లాంగ్ స్టాండింగ్ అనేది చాలా కష్టం. అందుకే ఈ అమ్మడు రూట్ మార్చిందట. ఇప్పుడు ఏకంగా తనకు బాగా పేరు తెచ్చే ఒక యాక్టింగ్ బేస్డ్ క్యారెక్టర్ లో నటిస్తోందట. ఇంతకీ ఎవరీ భామ అంటే.. మన్మథుడు 2 ఫేం అక్షర గౌడ.

ఈ సూపర్ మోడల్ కం నటి ఇటీవల వరుసగా ఐటెమ్ నంబర్లలో నర్తించి యువతరంలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. తదుపరి `సూర్పనాగై`లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. రెండు వేర్వేరు కాలక్రమాలలో కథానాయిక పాత్ర తెరపై అలరిస్తుందట.

ప్రతిసారీ అందాల ఆరబోతకు లేదా ఐటెం గీతాల్లో నర్తించేందుకు అవకాశాలిచ్చేవారు. ఈసారి మాత్రం తనని తాను నిరూపించుకునేందుకు ఆస్కారం ఇస్తున్నారట. ‘తుప్పాకి’ .. ‘అరంభం’ సహా పలు చిత్రాల్లో నటించినా అసలు ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు. మన్మధుడు 2లో ఫర్వాలేదనిపించే పాత్రలో చేసినా అవకాశాలేవీ రాలేదు. అందుకే తెలుగులో కూడా విడుదల కానున్న ‘సూర్పానగై’ తన డెస్టినీ మార్చేస్తుందని కలగంటోందట. తాజాగా వేడెక్కించే హాట్ ఫోటోషూట్ ని అక్షర అభిమానులకు షేర్ చేసింది. అన్నట్టు సూర్పనాగై అంటే సూర్పణఖ తరహా పాత్రనా? లేక నాగిని తరహా పాత్రనా? అన్నది తెలియాల్సి ఉంది.