డిస్ లైక్స్’తో రికార్డు సృష్టిస్తున్న యంగ్ హీరోయిన్ న్యూ ట్రైలర్..!!

0

బాలీవుడ్ దివంగత యువ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలన్ని సినీ ప్రేక్షకుల ముందుంచింది. దశాబ్దాలుగా నెపోటిజంతో ప్రతిభ గల నటులకు అవకాశాలు దక్కకుండా అణగదొక్కుతారన్న విషయం మరోసారి స్పష్టమైనట్లే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో రోజురోజుకి భిన్నాభిప్రాయాలు రేకెత్తుతూనే ఉన్నాయి. బాలీవుడ్లోని కొందరు పెద్దలు.. పెత్తనం చలాయించి సుశాంత్ కెరీర్ను నాశనం చేయడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా సుశాంత్ మరణాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అయితే సుశాంత్ సూసైడ్ కేసులో ప్రధాన నిందితులైన కరణ్ జోహార్ అలియా భట్ ల సినిమాల పై సినీ ప్రేక్షకులు రివెంజ్ తీర్చుకుంటున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కరణ్ నిర్మించిన గుంజన్ సక్సేనా బయోపిక్ పై నెగటివ్ వర్షం కురిసింది.

ఇక ప్రస్తుతం ఇటీవలే విడుదలైన ‘సడక్ 2″ మూవీ ట్రైలర్ పై డిస్ లైక్స్ తో ప్రతాపం చూపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య పై స్పందించే వారంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. విడుదలకు సిద్ధమైన అలియా భట్ లేటెస్ట్ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘సడక్ 2’ ట్రైలర్ ప్రపంచంలోనే అత్యంత డిస్ లైక్స్ పొందిన వీడియోగా రికార్డులో కెక్కింది. ఈ ట్రైలర్ను ఇప్పటివరకు 61 మిలియన్ల పైగా జనం వీక్షించగా.. 11.65 మిలియన్ల మంది డిస్లైక్ కొట్టడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ప్రపంచ రికార్డు ఎలాగంటే.. అత్యధికంగా డిస్లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉంది. ఇక మొదట్లో 18 మిలియన్ల డిస్ లైక్స్ తో ‘యూట్యూబ్ రివైండ్ 2018: ఎవరీ వన్ కంట్రోల్స్ రివైండ్’ వీడియో టాప్ లో ఉంది. ఆగష్టు 12న విడుదలైన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ సృష్టిస్తోంది. అటు వ్యూస్ పరంగాను ఇటు డిస్ లైక్స్ పరంగాను రికార్డులు నమోదు చేయడం పై సినీవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.