Templates by BIGtheme NET
Home >> Cinema News >> తల్లి కాబోతున్న `సాహో` బ్యూటీ ..ఈ పుట్టినరోజుకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అంటూ..!

తల్లి కాబోతున్న `సాహో` బ్యూటీ ..ఈ పుట్టినరోజుకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అంటూ..!


`సాహో` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన బ్యూటీ ఈవ్ లిన్ శర్మ. కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైన పాత్రలోనే అయినా నటిగా తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో యే జవానీ హై దివానీ- యారియాన్ లాంటి చిత్రాల్లో నటించాక.. స్టార్ గా బిజీ అయిపోతుందని భావించినా ఆశించిన రేంజుకు చేరలేకపోయింది. బాలీవుడ్ లో సరైన గాడ్ ఫాదర్ లేకపోవడంతో ఈవ్ లిన్ కెరీర్ జర్నీ ఆశించినంతగా సాగలేదు. ఆ క్రమంలోనే ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ తుషాన్ భిందిని పెళ్లాడి సర్ ప్రైజ్ చేసింది. ఆస్ట్రేలియలో డాక్టర్ వృత్తిలో ఉన్న తుషాన్ తో 2019లోనే నిశ్చితార్థం కాగా కొన్ని వారాల క్రితమే వివాహం చేసుకుంది.

ఇక పెళ్లి తర్వాతా ఈవ్ లిన్ నటిగా తన కెరీర్ ని కొనసాగించనుందా అంటే దానికి సమాధానం రావాల్సి ఉంది. ఇంతలోనే భర్త తుషాన్ భిండితో మొదటి బిడ్డను ఆశిస్తున్న ఎవెలిన్ శర్మ గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. అలాగే ఈవ్ లిన్ బేబీ బంప్ ఫోటోని షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈవ్ లిన్ శర్మ ఆదివారం తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో గర్భం పై పూర్తి క్లారిటీనిచ్చారు. మే 15న వారి వివాహం జరిగిన రెండు నెలల లోపు ఈ వార్త వినడం అభిమానులకు ఒక బిగ్ స్వీట్ సర్ ప్రైజ్.

ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలో ఎవెలిన్ శర్మ తన బేబి బంప్ పై చేతిని ఉంచి ఆరుబయట రిలాక్స్ డ్ గా పడుకున్న ఫోటోను షేర్ చేసింది. “నిన్ను నా చేతుల్లో పట్టుకోవటం కోసం వేచి ఉండలేను“ అని ఈవ్ లిన్ తన శీర్షికలో రాసింది. ఎల్నాజ్ నోరౌజీ- ఎల్లీ అవ్రమ్ -సోనాల్ చౌహాన్ లు సహా ఈవ్ లిన్ తో పని చేసిన ఇండస్ట్రీ సహోద్యోగుల నుండి అభినందన సందేశాలు ఈ సందర్భంగా వెల్లువెత్తాయి.

జూలై 12 న తన పుట్టినరోజు జరుపుకోవడానికి ముందే గొప్ప శుభవార్త ను అభిమానుల చెవిలో వేస్తున్నందున ఇదే తనకు `ఉత్తమ బహుమతి` అని ఆనందం వ్యక్తం చేసారు ఈవ్ లిన్.

ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. “మేము చంద్రమండలం అధిరోహించినట్టుగా ఉంది! ఇది నా పుట్టినరోజున నేను కోరుకునే ఉత్తమ బహుమతి. భవిష్యత్తులో ప్రతి అందమైన క్షణం ఆస్వాధన కోసం మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఈ బిడ్డ ఆస్ట్రేలియాలో జన్మించనుంది“ అని తెలిపారు.

ఆస్ట్రేలియాతో అనుబంధం ఉన్న జర్మనీ బ్యూటీ ఈవ్ లిన్ శర్మ. “గ్లోబల్ క్రైసిస్ నేపథ్యంలో సరిహద్దులు తెరిచినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కుటుంబం స్నేహితులు మా చిన్నారిని సందర్శించాలని మేము ఆశిస్తున్నాము“ అని ఆమె తెలిపింది.

ఈవ్ లిన్ ఇతర నాయికల్లా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఏదీ దాచలేదు. ప్రతిదీ బహిరంగంగా నే వెల్లడించింది. గత నెలలో తన పెళ్లి వేడుక ఫోటోలను ఈవ్ లిన్ పంచుకుంది. “మిస్టర్ & మిసెస్ భిండి.. ఈ చిన్న వేడుకను మా జీవితంలో బెస్ట్ డే గా చేసిన ప్రతి ఒక్కరికి పెద్ద ధన్యవాదాలు!“ అని పేర్కొంది. కొత్త జీవితం.. కొత్త ప్రారంభం.. తర్వాత ఏమిటి? అంటూ ఎగ్జయిట్ అయ్యింది ఈవ్ లిన్.

వివాహానంతరం ఎవెలిన్ – తుషాన్ ఆస్ట్రేలియాలో హనీమూన్ ని ఆస్వాధించారు. ఆస్ట్రేలియాలోని విట్ సుండేస్ లోని ఒక లగ్జరీ హోటల్ లో బస చేశారు. భర్తతో రొమాంటిక్ డేట్ కి సంబంధించిన చాలా ఫోటోలను ఈవ్ లిన్ షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇది మా ‘ఉత్తమ జీవితం’ అని ఆ ఫోటోలకు వ్యాఖ్యను జోడించింది.

ఒక సాధారణ స్నేహితుడు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్ లో 2018 లో మొదటిసారి కలుసుకున్న ఎవెలిన్ -తుషాన్ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. 2019 అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద అతను ప్రపోజ్ చేశాడు. గిటార్ వాద్యకారుడు ఒక మోకాలిపై ఉన్న చందంగా తమ ఫేవరెట్ పాటలను ప్లే చేస్తూ ప్రపోజ్ చేశాడు. తనను వివాహం చేసుకోమని ఆమెను కోరాడు. సిడ్నీ స్కైలైన్ నేపథ్యంలో వారు ముద్దు పెట్టుకునే చిత్రంతో పెళ్లి వార్తలను ప్రకటించారు.