ఆదిపురుష్ ‘లంకేష్’ అఫిషియల్ అనౌన్స్ మెంట్

0

ప్రభాస్ చేయబోతున్న భారీ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయిన ఈ సమయంలో రాముడిపై సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన దృష్టి సినిమాపై ఉంటుంది. అందుకే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ రాముడు అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇక నేడు రావణుడు ఎవరు అనే విషయంలోనూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

సినిమా అనౌన్స్ చేసిన రెండు వారాల్లోనే సినిమాలోని లంకేష్ (రావణుడు) ఎవరు అనే విషయంలో యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లుగానే సైఫ్ అలీ ఖాన్ యాజ్ లంకేష్ అంటూ ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీతో ఈ సినిమా వెయట్ మరింతగా పెరిగింది. రాముడు.. రావణుడు క్లారిటీ ఇక సీత లక్ష్మణుడి పాత్రల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

బాహుబలి.. సాహోలతో బాలీవుడ్ స్టార్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో మరో రెండు మెట్లు ఎక్కడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఇదో అద్బుతమైన విజువల్ వండర్ గా రాబోతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెడుపై మంచి గెలుపు అనే ట్యాగ్ తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోవడం ఖాయం అంటున్నారు.