Templates by BIGtheme NET
Home >> Cinema News >> సలార్.. ఇది సౌత్ ఇండియా టార్గెట్

సలార్.. ఇది సౌత్ ఇండియా టార్గెట్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమాని ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో సినిమా రిలీజ్ కి ఇంకా ఐదు వారాల సమయం ఉంది.

ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ అన్ని రాష్ట్రాలలో జరిగిపోయింది. సలార్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇప్పుడు బయటకొచ్చింది. సలార్ ను ఆంధ్రప్రదేశ్ ఏరియా బట్టి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే తెలంగాణలో కంప్లీట్ గా మైత్రీ మూవీ మేకర్స్ డిస్టిబ్యూట్ చేస్తోంది. ఇక తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడ్ జెయింట్ సలార్ డిస్టిబ్యూటర్ గా ఉంది. కేరళలో పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ సలార్ ను రిలీజ్ చేస్తోంది. కర్ణాటకలో మాత్రం సలార్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ సొంతంగా విడుదల చేయనుంది.

ఇక సలార్ నైజాం రైట్స్ విలువ 65 కోట్లు కాగా, ఆంధ్రా రైట్స్ విలువ 70 కోట్లు. సీడెడ్ రైట్స్ విలువ 27 కోట్లతో. తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు 165 కోట్లు బిజినెస్ జరిగింది. అయితే మిగతా ఏరియాల్లో ఆయా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నిర్మాతలు సొంతంగానే రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లో మిగిలిన మూడు రాష్ట్రాలలో సలార్ 75 కోట్ల బిజినెస్ వేల్యూతో థియేటర్స్ లోకి రావడానికి సిద్ధం అవుతోంది.

మొత్తం దక్షిణాదిలోనే సుమారు 240 కోట్లు. బిజినెస్ సలార్ సినిమాపై జరిగిందని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. నార్త్ 100 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని టాక్. అదే జరిగితే కేవలం థీయాట్రికల్ రైట్స్ ద్వారానే 350 కోట్ల వరకు సలార్ పై బిజినెస్ జరుగుతుంది. అతి పెద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ లు గా కనిపిస్తున్నారు. మరి ప్రభాస్ కి ఈ సినిమా ఏపాటి సక్సెస్ ని అందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.