Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రో కబడ్డీ కోసం బాలయ్యతో అదిరిపోయే ప్లాన్

ప్రో కబడ్డీ కోసం బాలయ్యతో అదిరిపోయే ప్లాన్

ఇండియాలో ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రాచూర్యం పొందిన స్పోర్ట్స్ లీడ్ ప్రో కబడ్డీ. ఇండియన్ నేషనల్ గేమ్స్ లో ఒకటైన ప్రో కబడ్డీని కూడా ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజ్ లు వేసి రాష్ట్రాల వారీగా టీంకి డివైడ్ చేశారు. ఈ లీగ్ లో అన్ని దేశాలకి చెందిన కబడ్డీ ఆటగాళ్ళు పాల్గొంటారు. అలాగే ఈ లీగ్ కి అత్యంత ప్రజాదారణ ఉంది. ఈ లీగ్ పైన కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది.

సెలబ్రిటీలు కూడా కొన్ని కబడ్డీ ఫ్రాంచైజ్ లకి ఓనర్స్ గా ఉన్నారు. ఆటగాళ్ళకి కూడా ఈ ప్రో కబడ్డీ లీగ్ వలన లక్షల నుంచి కోట్లలో ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఏడాది ప్రో కబడ్డీ లీగ్ త్వరలో మొదలవుతోంది. డిసెంబర్ 2 నుంచి ఈ సందడి షురూ కాబోతోంది. అన్ని భాషలలో ఈ లీగ్ ని స్టార్స్ తో ప్రమోట్ చేస్తున్నారు. అలాగే తెలుగు టైటాన్స్ పేరుతో ఒక కబడ్డీ టీమ్ ఉంది.

ఇప్పటికే శ్రీలీలతో ఒక ప్రోమో కట్ చేసి వదిలారు. ప్రస్తుతం అదిరిపోయే స్టైల్ లో ఇంటరెస్టింగ్ ప్రో కబడ్డీ ప్రమోషన్ కోసం బాలయ్యతో ఒక స్నాక్ పీక్ డిజైన్ చేశారు. దీనిని ట్రైలర్ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకి ఈ స్నాక్ పీక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోలో వారియర్ గెటప్ లో బాలయ్య కనిపిస్తాడు. ప్రో కబడ్డీ ప్రమోషన్ కోసం చేయబడిన ఈ వీడియో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇప్పటి వరకు సినిమాలకి మాత్రమే ట్రైలర్, స్నాక్ పీక్ ఫార్మాట్ అనేది ఉండేది. కాని మొదటిసారి బాలయ్యతో ప్రో కబడ్డీ కోసం ఇలాంటి స్నాక్ పీక్ రూపొందించడం విశేషం. మరి దీనికి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి. ఒక వేళ స్పందన బాగుంటే మాత్రం మచ్చితంగా ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని ప్రమోషన్ వీడియోలు వస్తాయి. ముఖ్యంగా తెలుగు టైటాన్స్ కోసం సెలబ్రిటీలతో ఈ ప్రమోషన్ వీడియోలని రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం. డిసెంబర్ 2 న ప్రారంభం కాబోయే ఈ ప్రో కబడ్డీ లీగ్ ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి.

Share via
Copy link