సల్మాన్ వ్యానిటీ వ్యానా మజాకానా.. అదో లగ్జరీ విల్లా!

0

సినీ సెలబ్రిటీలు ఎక్కువ సమయం చక్రాల రధంపై గడపాల్సి ఉంటుంది. షూటింగ్ సమయాల్లో ఎక్కువ సమయం వారి వానిటీ వ్యాన్లలోనే గడుపుతారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున కారవాన్ గురించి ఇటీవల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే. అదే తరహాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన వ్యానిటీ వ్యాన్ కూడా వార్తల్లో నిలుస్తోంది. అతనికి సంబంధించిన వ్యానిటీ వ్యాన్ అత్యంత ఖరీదైన ఆకర్షణీయమైన ఓ లగ్జరీ విల్లాలా కళ్లు మిరుమిట్లు గొలిపేలా కనిపిస్తోంది.

సినిమాలతో పాటు రియాలిటీ షో బిగ్ బాస్ తో నిత్యం బిజీగా వుండే సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్ కు తగినట్టుగా తన వ్యానిటీ వ్యాన్ని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా ఓ లగ్జరీ విల్లాగా మలుచుకోవడం పలువురిని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంట్లో కంటే వ్యానిటీ వ్యాన్ లలోనే ఎక్కువగా సమయం గడుపుతుండటంతో దీని కోసం సల్మాన్ అత్యధికంగా ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఇంటికి దూరంగా షూటింగ్ లు వుండటంతో స్టార్ లు సకల సౌకర్యాలతో వ్యానిటీ వ్యాన్ లని సిద్ధం చేయించుకుంటున్నారు.

సల్మాన్ కూడా తన కోసం అలాంటి లగ్జరీ సౌకర్యాలతో భారీ వ్యయంతో ఓ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ని సిద్ధం చేయించుకున్నాడు. దీనికి ఎప్పటికప్పుడు మెరుగులద్దేందుకే బోలెడంత ఖర్చు పెడుతున్నాడట. లేత గోధుమ రంగు ఇంటీరియర్ తో వుంటే ఈ వ్యానిటీ వ్యాన్ లో కాలక్షేపానికి ఒక భారీ టీవీ .. లంచ్ డిన్నర్ తినడానికి టేబుల్.. డ్రెస్సింగ్ టేబుల్.. హాయిగా రిలాక్స్ కావడానికి సోఫాసెట్… అధునాతనమైన బెడ్.. మెలో లైటింగ్.. వాష్ రూమ్ వంటి సౌకర్యాలన్నీ వున్నాయి. వ్యానిటీ వ్యాన్ లో సల్మాన్ కు సంబంధించిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవన్నీ చూసిన వారు ఇది కలా నిజమా అని సంభ్రమాశ్చర్యాలకి లోనవుతారట.