ఆ గుండు బాస్ లుక్ వెనక టాప్ సీక్రెట్ ఇదే

0

ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ సహా పలువురు దర్శకులకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టు పనులు నడుస్తున్నాయి. ఈ నాలుగైదు నెలల క్వారంటైన్ సమయాన్ని పూర్తిగా నవ్యపంథా స్క్రిప్టుల ఎంపిక సహా దర్శకుల్ని ఫైనల్ చేయడంపైనే దృష్టి సారించారు చిరు.

ఇప్పుడు అన్ లాక్ 4.0 లో అడుగు పెట్టాం కాబట్టి ఇకపై అన్ని రూల్స్ పాటిస్తూ సెట్స్ కెళ్లాల్సిందేనని చిరు ఫిక్స్ అయ్యారట. ఇక ఆచార్య చిత్రం కోసం ప్రిపేరవుతున్న ఈ సమయంలో ఉన్నట్టుండి మెగాస్టార్ గుండు (బాల్డ్ ) లుక్ తో కనిపించి అభిమానులకు షాకిచ్చారు. ఇదేంటి ఈ మెగా సర్ ప్రైజ్ అంటూ ఆ ఫోటోని అంతర్జాలంలో ఫ్యాన్స్ స్వయంగా వైరల్ చేశారు. ఆచార్య షూట్ మళ్ళీ పునః ప్రారంభం అయ్యేందుకు రెడీ అవుతుంటే ఆ మూవీ లుక్ తో సంబంధమే లేకుండా ఇలా కనిపించారు? అన్న చర్చ సాగుతోంది.

అయితే ఈ లుక్ `వేదాళం` రీమేక్ కోసమేనని అంతా భావిస్తున్నారు. దీనికోసం చిరు చాలానే రిస్క్ చేశారని ఓ సెక్షన్ అభిమానులు భావిస్తున్నారు. అక్కడ ఆ మూవీలో అజిత్ పండు వెంట్రుకలు గుబురు గడ్డంతో కనిపిస్తే అందుకు పూర్తి భిన్నమైన గెటప్ తో చిరు కనిపిస్తున్నారా? అన్న చర్చా సాగుతోంది. అయితే ఆ మూవీలో అజిత్ గుండు లాంటి లుక్ తో కూడా కనిపిస్తాడు. దానికోసమే చిరు ప్రిపేరవుతున్నారన్న గుసగుసా వినిపిస్తోంది. మరోవైపు చిరు వేదాళం రీమేక్ సన్నివేశాల్లో నటిస్తూనే ఆచార్యలో బ్రాహ్మణుడి తరహా జంధ్యం గెటప్ ని డబుల్ ప్లాన్ చేశారన్న గుసగుసా వేడెక్కిస్తోంది. ఆచార్య అలానే వేదాళం రీమేక్ రెండిటికీ ఈ లుక్ అవసరం కాబట్టి తెలివిగా ఇటూ అటూ ప్లాన్ చేశారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరి వీటన్నిటికీ కొణిదెల టీమ్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి క్లారిటీ ఇస్తేనే బావుంటుందేమో!