`అవతార్ 2` అండర్ వాటర్ సీక్వెన్స్ `జురాసిక్ వరల్డ్ 2`ని మించి!

0

అవతార్ మూవీ కోసం పండోరా గ్రహాన్ని సృష్టించి లెజెండరీ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. ఈ చిత్రాన్ని చూసిన జనం ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. త్వరలో ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్నారు జేమ్స్ కామెరూన్. ఆయన ఈసారి అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నట్టు కనిపిస్తోంది. అవతార్ ని ఓ రేంజ్ లో చూపించిన ఆయన సీక్వెల్స్ ని అండర్ వాటర్ లో ప్లాన్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

ఈ క్రేజీ సీక్వెల్ కి సంబంధించిన దృశ్యాలని న్యూజిలాండ్ లోని అండర్ వాటర్ లో షూట్ చేస్తున్నారు. ఇటీవల కొన్నిఅండర్ వాటర్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. అండర్ వాటర్ లో చిత్రీకరించిన స్టంట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయనున్నాయట. గత ఏడు ఆరు నెలలుగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో చిత్ర బృందం షూటింగ్ ని నిరవధికంగా నిలిపి వేసింది. తాజాగా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా తిరుగు షూటింగ్లకు అనుమతులు ఇవ్వడంతో `అవతార్` సీక్వెల్స్ షూటింగ్ మళ్లీ మొదలైంది.

అయితే ఈ సమయంలో ఈ చిత్రం కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన టీమ్ అ టెక్నాలజీతో నీటి అడుగుల సరికొత్త అవతార్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో చిత్రీకరణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. నీటి అడుగున షూటింగ్ చేస్తున్న సమయంలో నటీనటులు ఎలాంటి భయానికి లోనుకాకూడదని హవాయి తీరంలో శిక్షణ ఇచ్చారట. ఇక అవతార్ ముగింపులో మృతి చెందినట్టుగా చూపించిన డాక్టర్ పాత్ర సీక్వెల్ లోనూ కనిపిస్తుందట. అది ఎలా అన్నదే సస్పెన్స్ గా చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ఆక్వామేన్ ని మించేలా.. జురాసిక్ వరల్డ్ సీక్వెల్ అండర్ వాటర్ ఎపిసోడ్స్ ని కొట్టేలా కామెరూన్ అవతార్ సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తున్నారనే అర్థమవుతోంది. ఈ మూవీలో కీలక పాత్రల్లో సామ్ వర్తింగ్ టన్.. జో సాల్దానా.. జియోవన్నీ రిబిసి.. స్టీఫెన్ లాంగ్.. జోయెల్ డేవిడ్ మూర్.. దిలీప్ రావు.. సిసిహెచ్ పౌండర్ మరియు మాట్ జెరాల్డ్ కనిపించనున్నారు.

కొత్తగా ఇందులో కేట్ విన్స్లెట్- క్లిఫ్ కర్టిస్- ఈడీ ఫాల్కో- బ్రెండన్ కోవెల్- మిచెల్ యే- జెమైన్ క్లెమెంట్- ఓనా చాప్లిన్- డేవిడ్ థెవ్లిస్- విన్ డీజిల్ మరియు సిజె జోన్స్ ఉన్నారు. `అవతార్ 2` 2022 డిసెంబర్ లో విడుదల కానుంది.