Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెగాస్టార్ తో `సామ్ జామ్` డబుల్ ఫన్నీ ట్రీట్..

మెగాస్టార్ తో `సామ్ జామ్` డబుల్ ఫన్నీ ట్రీట్..


ఆహా-ఓటీటీ వేదికపై `సామ్ జామ్` కార్యక్రమం పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే. అక్కినేని కోడలు హోస్టింగ్ ఎంతో ప్రత్యేకంగా ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే రానా-విజయ్ దేవరకొండ- తమన్నా లాంటి స్టార్లతో సామ్ జామ్ ఎపిసోడ్స్ రక్తి కట్టించాయి. సమంత తెలివైన ఫన్నీ ప్రశ్నలతో అద్భుతంగా హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షో డిజిటల్ వేదికపై పెద్ద హిట్.

ఈసారి క్రిస్మస్ స్పెషల్ గా సామ్ జామ్ మరింత రంజింపజేయనుంది. అయితే ఈసారి అతిథి ఎవరు? అంటే.. ఇండస్ట్రీ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సామ్ జామ్ ఎంతో ఫన్ జాయ్ తో సాగనుందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి తో స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం సూపర్ ఫన్ తో రక్తి కట్టించనుందని సమాచారం. షోలో సమంతను చిరు అడిగే వెరైటీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుందట. అలాగే మెగాస్టార్ చిరంజీవి పేదలకు ఇచ్చే విరాళం కూడా ఈ షోలో ప్రత్యేకంగా హైలైట్ కానుంది. సామ్ జామ్ కి మునుముందు ప్రభాస్ లాంటి స్టార్ హాజరవుతారా? అన్నదానికి సమాధానం రావాల్సి ఉంది.