బాలీవుడ్ టు టాలీవుడ్ కోలీవుడ్ కథానాయికలంతా మాల్దీవులకు జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే ఒంటరి దీవిలో బీచ్ లన్నీ అగ్గి రాజుకుపోతున్నాయ్. చలికాలంలోనే వేసవి మంటలు పుట్టిస్తున్నారు.
మలైకా.. రకుల్.. పరిణీతి .. కాజల్ .. ఇలా అందాల నాయికలంతా మాల్దీవుల్ని షేక్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని కోడలు సమంత యాడైన సంగతి తెలిసిందే. కాజల్ – కిచ్లు కపుల్ లానే.. స్టార్ కపుల్ నాగ చైతన్య – సమంత మాల్దీవుల విహారంలో ఉన్నారు. అక్కడి నుంచి సామ్ రకరకాల ఫోటోల్ని షేర్ చేసారు. ఇక అడ్వెంచర్ లోనూ సామ్ ఎక్కడా తగ్గడం లేదు. అండర్ వాటర్ సాహసానికి రెడీ అయినప్పటి ఫోటోని తాజాగా రివీల్ చేశారు. చై-సామ్ జంట ఇటీవల ఈ సుందరమైన ద్వీపంలో రసాస్వాధనల్లో మునిగి తేలుతోంది.
సమంతా ఇన్ స్టాలో లేటెస్టుగా కొన్ని చిత్రాలను పంచుకుంది. అందులో ఓ ఫోటోలోఫ్లోరిష్ మ్యాక్సీ దుస్తుల్లో తళుక్కుమంది. మరొకటి ఆమె నీటి అడుగున స్కూబా డైవింగ్ అడ్వెంచర్ కు వెళుతున్నప్పటి ఫోటో కూడా ఉంది. కెమెరాను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిగ్గుపడే చైతూ కూడా ఓ రెండు ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఇవన్నీ వైరల్ గా మారాయి. వీటికి కామెంట్లు జోరెక్కిపోతున్నాయ్.