నెంబర్ ఇచ్చామంటే సమస్య మొదలవుతుంది : సమంత

0

ఇటీవల సమంత ఒకానొక సందర్బంగా తనకు వస్తున్న కాల్స్ మరియు మెసేజ్ లతో చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకు ఎన్నో తెలియని కాల్స్ మరియు మెసేజ్ లు వస్తున్నాయి. వాటి వల్ల కొన్ని సార్లు చాలా చిరాకుగా ఉంటుందని సమంత వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి సమంత ఆ విషయమై స్పందిస్తూ.. అప్పట్లో నేను నా సొంత ఫోన్ నెంబర్ తో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం.. క్యాబ్ బుక్ చేయడం చేసేదాన్ని. ఏదైనా షాపింగ్ కు వెళ్లినా కూడా నా నెంబర్ ఇవ్వడం జరిగింది. దాంతో నాకు ప్రతి రోజు పదుల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. వాటన్నింటికి సమాధానం చెప్పలేక తలనొప్పిగా ఉంటుంది.

ఇక ఫోన్ నెంబర్ తెలియడంతో చాలా సార్లు నా సోషల్ మీడియా అకౌంట్ ను ఇతరులు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు పలు సార్లు మీ సోషల్ మీడియా అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అది మీరేనా అంటూ కన్ఫర్మేషన్ మెసేజ్లు వస్తున్నాయి. సెలబ్రెటీల ఫోన్ నెంబర్ బయటకు వెళ్తే మొత్తం జీవితమే మారిపోతుంది.

ఒక్క రెస్టారెంట్ లో ఫోన్ నెంబర్ తో టేబుల్ బుక్ చేస్తే ఆ తర్వాత పది రెస్టారెంట్ల నుండి కాల్స్ వస్తున్నాయి. ఈమద్య కాలంలో దేనికి అయినా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆతర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయమేస్తుందని సమంత చెప్పుకొచ్చింది. ఎక్కడైనా నెంబర్ ఇస్తే సమస్య మొదలు అవుతుందని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తన ఒక్కదాని సమస్య కాదని అందరి సమస్య అంటూ సమంత పేర్కొంది.