పీవీ సింధు బయోపిక్ లో సమంత?

0

బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర నడుస్తోంది. ఈ తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్నడటంతో మేకర్స్ బయోపిక్ ల బాట పడుతున్నారు. బాలీవుడ్ లో తాజాగా స్పోర్ట్స్ నేపథ్య బయోపిక్ ల హంగామా అంతకంతకు వేడెక్కిస్తోంది. పీవీ సింధు- మిథాలీ రాజ్ – సైనా నెహ్వాల్ – పుల్లెల గోపీచంద్ ల బయోపిక్ లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో కొన్ని సెట్స్ పైకి వెళ్లాయి కూడా. కొన్ని ఇంకా చర్చల దశలోనే వున్నాయి. అందులో పీవీ సింధు బయోపిక్ చాలా కాలంగా హాట్ టాపిక్.

పీవీ సింధు బయోపిక్ ని కలియుగ దాన కర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోను సుద్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే ఆ పాత్రలో నటిస్తామంటూ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లు వరుసగా సొనూ సూద్ కు ఫోన్ లు చేశారట. అయితే సింధు ముఖ కవలికలకు అత్యంత దగ్గరగా వుండే వారిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేసిన సోనుసూద్ ఆ పాత్ర కోసం దీపికా పదుకునేని సంప్రదించారట.

దీపిక వెంటనే అంగీకరించినట్టు తెలిసింది. మధ్యలో ఈ పాత్రని సమంత చేసే అవకాశం వుందంటూ వార్తలు షికారు చేశాయి. కానీ ఆ వార్తల్ని సోనూ సూద్ ఖండించారు. దీపిక మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని బలంగా నమ్ముతున్న సోను ఆమె డేట్స్ కుదిరినప్పుడే పీవీ సింధు బయోపిక్ ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఇక మరో తెలుగు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ లో పరిణీతి చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే.