అదీ సమంత రేంజ్

0

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. ఇక ఇండస్ట్రీలో అయితే ఒక్క ఛాన్స్ కెరీర్ నే మార్చేస్తుందని నమ్ముతుంటారు. అది చాలా మంది విషయాల్లో నిజమని నిరూపితమైంది కూడా. స్టార్ హీరోయిన్ సమంత విషయంలోనూ ఒకే ఒక్క ఛాన్స్ ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. అదే `పుష్ప ది రైజ్`. స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది.

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఐటమ్ సాంగ్ తో రచ్చ రచ్చ చేసింది. `ఊ అంటావా మావ.. ఊహూ అంటావా..` అంటూ ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. అప్పటి వరకు సమంత ఒకేత్తు ఈ పాటలో ఆమె కనిపించిన తీరు మరో ఎత్తు. చైతో విడాకుల తరువాత తీవ్ర డిప్రెషన్ కు లోనైన సమంతకు బిగ్ రిలీఫ్ ని ఇవ్వడమే కాకుండా ఆమె కెరీర్ ని సరికొత్త మలుపు తిప్పింది. ఇంతకు ముందు వున్న సమంత క్రేజ్ కి ఈ పాట తరువాత ఏర్పడిన క్రేజ్ కి చాలా మార్పు కనిపించింది.

రాజ్ ఎన్ డీకే ద్వయం రూపొందించిన `ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ లో సమంత రాజీగా నటించిన విషయం తెలిసిందే. నటిగా ఈ మూవీతో ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది కానీ సమంతకు బాలీవుడ్ లోనూ క్రేజ్ ని మాత్రం అందించింది `పుష్ప` మాత్రమే. ఈ చిత్రంలోని `ఊ అంటావా మావ.. ఊహూ అంటావా..` వరల్డ్ వైడ్ గా వైరల్ అయింది. అంతే కాకుండా ఈ పాటలో సామ్ స్పైసీ నెస్ ని పెంచి ప్రత్యేక కాస్ట్యూమ్స్ ని ధరించిన తీరు ఆమె క్రేజ్ ని మరింత పెంచి పాపులర్ అయ్యేలా చేసింది.

సామ్ గురించి బాలీవుడ్ లోనూ చర్చ జరిగేలా చేసింది. ఇటీవల రాజ్ ఎన్ డీకే ద్వయం న్యూ వెబ్ సిరీస్ చర్చల్లో పాల్గొనడానికి బాలీవుడ్ వెళ్లిన సమంతని అక్కడి మీడియా అభిమానులు భారీ స్థాయిలో చుట్టుముట్టడం అక్కడ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వున్నా కూడా అతన్ని పట్టించుకోకుండా సామ్ వెంటపడటం.. క్రౌడ్ ని అదుపు చేయడం కోసం ఏకంగా హీరో వరుణ్ ధావన్ బాడీ గార్డ్ గా మారి సామ్ ని కార్ వరకు తీసుకెళ్లి సురక్షితంగా కార్ ఎక్కించడం బాలీవుడ్ లో `పుష్ప` కారణంగా పెరిగిన ఆమె క్రేజ్ ని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లోనూ సమంత సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. `పుష్ప`లో తాను చేసిన `ఊ అంటావా మావ.. ఊహూ అంటావా..` సాంగ్ తను నటించిన గత చిత్రాలని మర్చిపోయేలా చేసిందని నటిగా తనలో కొత్త జోష్ ని నింపడమే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యేలా చేసిందని చెప్పడం విశేషం.

ఒకే ఒక్క పాట సమంత క్రేజ్ ని పాన్ ఇండిమా లెవెల్లో పాపులర్ అయ్యేలా చేయడం.. బాలీవుడ్ హీరో సైతం సామ్ క్రేజ్ ని ఫిదా అయిపోయి బాడీగార్డ్ గా మారడంతో ఇదీ సమంత రేంజ్ అని ఈ పాట కంప్లీట్ గా సామ్ రేంజ్ ని మార్చేసిందని కామెంట్ లు చేస్తున్నారు. మారిన సమంత రేంజ్ ని క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్ మేకర్స్ చాలా మంది ఆమెతో సినిమాలు చేయాలని వెంటపడుతుండటం విశేషం.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.