జాగ్రత్త! ఇండస్ట్రీలో పాములు కరిచేస్తాయన్న నటి!!

0

సినిమా ఇండస్ట్రీ వైకుంఠపాళి ఆట లాంటిది! ఇక్కడ ఆడేవాళ్లకు ఆడుకున్నంతా!! అంటోంది సమీరా రెడ్డి. మొన్నటివరకూ తన అందం గురించి.. కిడ్ గురించి గర్భిణీ స్త్రీల కష్టనష్టాల గురించి మాట్లాడిన సమీరా ఇప్పుడు కొత్త టాపిక్ ని ఎత్తుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతర పరిణామాల దృష్ట్యా ఇండస్ట్రీ ప్లేయర్స్ గురించి కూడా నోరు విప్పింది.

అంతేకాదు.. నెపోటిజం ఇండస్ట్రీలో ఆట ఆడలేక ఓడిపోయానని అంగీకరించిన సమీరా నటవారసులకు అవకాశాలివ్వడం కోసం తనను మూడు సినిమాల నుంచి తీసేశారని చెప్పి బాంబ్ పేల్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి ప్లేయర్స్ ఉంటారని .. నీకు సరిపడే ట్యాలెంట్ లేదని దూరం పెట్టేస్తారని చెప్పుకొచ్చింది. దానివల్ల నిజంగా ప్రతిభ లేదేమోనని భయపడతామని కూడా వెల్లడించింది. ఇక్కడ ప్రతి అడుగూ సరిగా వేయాలి. లేదంటే పాములు కరిచేస్తాయని హెచ్చరించింది. స్టార్ల వారసుల ప్రాపకంలో ప్రతిభను తొక్కేస్తారని సమీరా తెలిపింది.

ఇక ఓ ముద్దు సన్నివేశాన్ని అనూహ్యంగా స్క్రిప్టులోకి జొప్పించి తనని వేధించారని కూడా సమీరా ఆరోపించింది. తొలిగా వినిపించిన స్క్రిప్టులో అలాంటి ముద్దు సీన్ లేకపోయినా.. తనని వేధించారట. అంతేకాదు తనను తొలగిస్తామని హెచ్చరించారని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ లేనిదే పరిశ్రమ లేనే లేదన్న వాదనను తెరపైకి తెచ్చింది ఈ భామ కూడా. సమీరా రెడ్డి బాలీవుడ్ టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన సంగతి విధితమే.