లవ్ లో ఫెయిలయ్యాక ఇలా కవ్వించాలా ఆండ్రియా?

0

దివాళీ దీపాన్ని.. ఊరించే అందాన్ని!! అంటూ అదిరిపోయే హస్కీ వాయిస్ తో పాట పాడింది `దడ` మూవీ కోసం. అక్కినేని నాగచైతన్య నటించిన దడలో అది స్పెషల్ సాంగ్. ఆ సింగర్ ఎవరో చెప్పాల్సిన పనే లేదు. హాట్ హీరోయిన్ కం సింగర్ ఆండ్రియా జెరోమియా. కార్తీ నటించిన `యుగానికి ఒక్కడు` చిత్రంతో ఈ అమ్మడు తెలుగులో ఫాలోవర్స్ పెంచుకుంది. ఆ తర్వాత నటిస్తూనే గాయనిగానూ రాణించింది.

అయితే ఈ అమ్మడు తానొకటి ఆశిస్తే కెరీర్ పరంగా ఇంకేదో జరిగింది. ఇటు తెలుగు అటు తమిళంలో హీరోయిన్ గా చాలా ట్రై చేసినా అగ్ర నాయిక హోదా అయితే దక్కలేదు. ఆ క్రమంలోనే యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తో నిండా ప్రేమలో పడింది. అటుపై సుచీలీక్స్ లో ఆండ్రియా పేరు మార్మోగింది. ఇక కాలక్రమంలో వివాదం తర్వాత ఆండ్రియా లవ్ లో ఫెయిలై డిప్రెషన్ లోకి వెళ్లిందని ప్రచారమైంది.

ఇటీవలే ఆ డిప్రెషన్ నుంచి బయటపడింది. ఇక అనిరుధ్ తో ప్రేమాయణం గురించి నోరు విప్పినా అతడి తప్పేమీ లేదని కవర్ చేసింది. తను స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. అదంతా సరే కానీ.. తాజాగా ఆండ్రియా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోల్లో ఆండ్రియా మెరూన్ డ్రెస్ లో హాట్ లుక్ మైమరిపిస్తోంది. ఇక బ్యాక్ లెస్ ఫోజులో కిల్లింగ్ లుక్ తో కట్టిపడేసింది.