Templates by BIGtheme NET
Home >> Cinema News >> రానా తండ్రి అతడే..

రానా తండ్రి అతడే..


2020లో మళయాలంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం అయ్యప్పనుమ్ కోషియం (ఏకే). ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తారన్న వార్త మొదలైనప్పటి నుంచి ఎవరు చేస్తారా? అనే చర్చ బాగానే సాగింది. చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పవన్ కళ్యాణ్ ఫైనల్ టేకోవర్ చేశారు. ఆ తర్వాత రానా దగ్గుబాటి రెండో హీరోగా సెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. ఇతర ఆర్టిస్టులు కూడా వేగంగా ఫైనల్ అవుతున్నారు.

ఈ సినిమాలో నిజాయితీ చిత్తశుద్ధిగల పోలీసు ఇన్ స్పెక్టర్ అయ్యప్పన్ నాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ను రానా దగ్గుబాటి పోషించనున్నారు. ఈ చిత్రంలో రానా తండ్రి పాత్రను తమిళ నటుడు సముద్ర ఖని పోషించనున్నట్టు సమాచారం. ఇది కూడా శక్తివంతమైన పాత్ర.

సముద్రఖని చివరి సారిగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించారు. ఇప్పుడు అతను మరోసారి పవన్-రానా కాంబినేషన్లో రాబోతున్న అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రంలో కనిపించబోతున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.