కొత్త హీరోతో సందీప్ వంగా..

0

`అర్జున్ రెడ్డి` చిత్రంతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా. ఆరంగేట్రమే బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే అదే సినిమాని నిర్మించిన టీసిరీస్ కోసం మరో సినిమాకి సంతకం చేశాడు. ప్రభాస్ .. మహేష్ .. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కథలు వినిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఏవీ వర్కవుట్ కాలేదు.

ప్రభాస్ తో టీసిరీస్ మూవీకి సందీప్ వంగా దర్శకత్వం వహించాల్సింది. దీనికోసం రణబీర్.. రణవీర్ లతోనూ కొన్నాళ్ల పాటు కథా చర్చలు జరిపాడు. కానీ స్క్రిప్టు వర్కవుట్ కాలేదని గుసగుసలు వినిపించాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే .. ఇక ఏ స్టార్ హీరోతోనూ అతడికి సింక్ కుదిరినట్టు కనిపించడం లేదు. ప్రభాస్ ఇప్పటికే నాగ్ అశ్విన్.. ఓంరౌత్ లాంటి డైరెక్టర్లకు కమిటైపోయాడు. ఇతర స్టార్లు వేరే కమిట్ మెంట్లతో బిజీ.

ఇప్పుడు సందీప్ ముందు ఉన్న ఆప్షన్ … స్టార్ హీరోలు కాకుండా ఎవరైనా కొత్త ముఖంతో అయితే బావుంటుందని అనుకుంటున్నారట. కరోనా వైరస్ విరామంలో సందీప్ వంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసాడట. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇందులో నవతరం హీరోలకు అవకాశం ఇస్తేనే బావుంటుందని భావిస్తున్నారు.. ఒక అగ్ర నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021లో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. త్వరలో వివరాలు వెల్లడించనున్నారు.