‘నన్ను బకరా చేసి సంకనాకించేశారు’

0

శాండిల్ వుడ్ డ్రగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డ్రగ్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగుళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరోయిన్స్ రాగిణి ద్వివేది – సంజనాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు రాహుల్ – వీరేన్ ఖన్నా – రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. రాగిణి – సంజనాలు డ్రగ్స్ సేవించామని అంగీకరించారని ఇటీవల పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సంజనా కు రక్త పరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ కు తీసుకెళ్లగా.. బ్లడ్ టెస్ట్ చేయించుకోడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘నన్ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పండి.. నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవు.. నేను ఎందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పండి?’ అంటూ సంజనా వైద్యుల ముందు వాపోయింది. పోలీసులు అనవసరంగా నన్ను అరెస్టు చేసి ప్రజల ముందు మీడియా ముందు బకరాను చేశారని.. నా జీవితాన్ని సంకనాకించేశారు అంటూ నటి సంజనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నేను రక్తపరీక్షలు చేసుకోను.. ఒకవేళ నా రక్తం బలవంతంగా సేకరించి మీరు పరీక్షలు చేసినా అది నా రక్తమే అనడానికి గ్యారెంటీ ఏమిటి.. నాకు పోలీసులు వైద్యుల మీద ఎవ్వరిమీద నమ్మకం లేదు’ అంటూ సంజనా ఆవేశంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘నాకు బ్లడ్ టెస్ట్ చట్టపరంగా చెయ్యాలి తప్పా బలవంతంగా కాదు.. మీరు ఇలా చెయ్యడం చట్టపరంగా నేరం’ అంటూ సంజనా చెబుతున్న వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.