ప్రెగ్నెంట్ గా ఉన్న హీరోయిన్ ప్రభాస్ కి జోడీనా? అసలు ఇది సాధ్యమేనా?

0

‘డార్లింగ్’ ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ ‘రాముడి’గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర కోసం ‘మహానటి’ కీర్తి సురేష్ మరియు కియారా అద్వాణీ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో మిస్ దివా యూనివర్స్ ఊర్వశి రౌతేలాను సీత పాత్ర కోసం సంప్రదించిన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లేనని ‘ఆదిపురుష్’ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే లేటెస్టుగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రభాస్ పక్కన నటించనుందని మరో రూమర్ పుట్టుకొచ్చింది.

కాగా అనుష్క శర్మ ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఇటీవల ప్రకటించారు. జనవరి 2021లో మా ఫ్యామిలీలో మరో మెంబెర్ జాయిన్ అవుతారని చెప్పుకొచ్చింది. కానీ ‘ఆదిపురుష్’ సినిమాని 2021 జనవరిలో స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో బేబీకి డెలివరీ ఇచ్చి.. బేబీ ఆలనాపాలనా చూసుకోకుండా వెంటనే షూటింగ్ లో పాల్గొనడం అసలు జరిగేపనేనా? సో ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.