ఆర్య – పా.రంజిత్ కాంబోలో వస్తున్న ‘సర్పట్ట’ ఫస్ట్ లుక్..!

0

‘మద్రాస్’ ‘కబాలి’ ‘కాలా’ వంటి వైవిధ్యమైన చిత్రాల తరువాత పా. రంజిత్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “సర్పట్ట”. దీనికి ‘పరంబరై’ అనేది ఉపశీర్షిక. ఇందులో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. స్లమ్ ఏరియా నుంచి వచ్చిన యువకుడు బాక్సర్ గా ఎలా సక్సెస్ అయ్యాడు అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. దీని కోసం ఆర్య భారీ వర్కౌట్స్ చేసి ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిపోయాడు. ఆర్య కెరీర్ లో 30వ చిత్రంగా వస్తున్న ‘సర్పట్ట’ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఆర్య ప్రీ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో ఆర్య బాక్సర్ గా అదిరిపోయే మేకోవర్ తో కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన ఎనిమిది పలకల దేహంతో తన లుక్ పూర్తిగా మార్చేశాడు. బరిలో తనకు పోటీగా వచ్చిన ప్రత్యర్థిని మట్టికరిపించడానికి ఆర్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్య ఈ సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేసాడో ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పార్థిబాన్ రాధాకృష్ణన్ – సంతోష్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణరాజ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.