అక్కడ అప్పుడే అమ్ముడైన సర్కారు వారి పాట

0

మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో అమెరికాలో ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ భారీ బిజినెస్ జరగడం చాలా కామన్. కాని ఈ సినిమా తమిళనాడులో డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండా విజయ్ టీవీ తమిళ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన సినిమాలు తమిళంలో చాలా వరకు డబ్బ్ అయ్యి శాటిలైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి. ఇప్పటి వరకు ఏ సినిమా దక్కించుకోని శాటిలైట్ రేటును ఈ సినిమా దక్కించుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించడం వల్ల విజయ్ టీవీ చాలా రేటు పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. తమిళనాట స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ వల్ల అక్కడ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి సర్కారు వారి పాట అమ్ముడు పోయే అవకాశం ఉంది అంటూ చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.