Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆమె ఈ సినిమాలో హీరో.. నేను కాదు

ఆమె ఈ సినిమాలో హీరో.. నేను కాదు


ఈమద్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ మూవీ లవ్ మాక్ టెయిల్ కు గుర్తుందా శీతాకాలం అధికారిక రీమేక్ అనే విషయం తెల్సిందే. ఈ సినిమాలో తమన్నాతో పాటు కీలక పాత్రల్లో మేఘా ఆకాశ్.. కావ్యశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండవ షెడ్యూల్ గత నెలలోనే ప్రారంభించాల్సి ఉన్నా తమన్నాకు కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.

తమన్నా కరోనాను జయించి.. ఇటీవలే 11త్ అవర్ వెబ్ సిరీస్ షూటింగ్ లో కూడా పాల్గొంది. అందుకే త్వరలోనే మళ్లీ గుర్తుందా శీతాకాలం సినిమా సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా సినిమా గురించి సత్యదేవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో నా కంటే తమన్నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆమె ఈ సినిమాకు నిజమైన హీరో అన్నట్లుగా సత్యదేవ్ అన్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో కథలు విన్నా కూడా వెంటనే కనెక్ట్ కాలేదు కాని ఎప్పుడైతే ఈ కథ విన్నానో వెంటనే కనెక్ట్ అయ్యి నటించాలనే నిర్ణయానికి వచ్చాను అన్నాడు. తమన్నా ఈ సినిమాలో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.