అఫ్ఘనిస్తాన్ లో తెలుగు హీరో అరెస్ట్

0

ఈమద్య కాలంలో సత్యదేవ్ వరుసగా తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన ఈ యువ హీరో ఇటీవల అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలను చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ ప్రారంభం అయిన విధానం నుండి సినిమా ఇండస్ట్రీలో పడ్డ కష్టం మరియు అఫ్ఘనిస్తాన్ లో అరెస్ట్ అయిన విషయం ఇలా ఎన్నో విషయాలను సరదాగా హీరో సత్యదేవ్ అలీతో ముచ్చటించిన సందర్బంగా వెళ్లడించాడు.

ఒక హిందీ సినిమా షూటింగ్ సమయంలో అఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడ 40 రోజుల పాటు చిత్రీకరణలో సత్యదేవ్ పాల్గొన్నాడట. ఆ సమయంలో సత్యదేవ్ ఒక రోజు వీదిలోకి వచ్చి అటు ఇటు తచ్చాడుతూ వెనక్కు ముందుకు చూస్తూ నడుస్తు ఉండటంతో గమనించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సూడైడ్ బాంబర్ అనే అనుమానంతో అరెస్ట్ చేశారు.

హిందూస్థాన్ అంటూ ఎంత చెప్పినా.. షూటింగ్ కోసం వచ్చామంటూ చెప్పిన వారు భాష అర్థం కాకో లేదా మరేంటో కాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారికి అసలు విషయం తెలియడంతో వదిలిల పెట్టారంటూ అప్పటి జ్ఞాపకాన్ని తెలియజేశాడు. ఇక ఈ టాక్ షో లోనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను చేయాల్సింది నేను అని కాని అది కొన్ని కారణాల వల్ల ప్రదీప్ చేశాడంటూ సత్యదేవ్ చెప్పాడు.