గౌతమ్ కంటే కాజల్ ఆస్తి ఎక్కువ?

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కోట్లల్లో పారితోషికం తీసుకుని స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ఒకానొక సమయంలో రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుని సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ పెళ్లికి రెడీ అయ్యింది. ముంబయికి చెందిన వ్యాపారి గౌతమ్ కుచ్లు ను ఈమె వివాహం చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈనెల 30వ తారీకున కుటుంబ సభ్యలు మరియు సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు ఒక్కటి అవ్వబోతున్నారు. ఈ సమయంలో గౌతమ్ ఆస్తి గురించి అతడి వ్యాపారల గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

గౌతమ్ 2015 సంవత్సరం నుండి లైఫ్ స్టైల్ డిజైన్ కంపెనీ మరియు ఇంటీరియర్ వ్యాపారంను నిర్వహిస్తున్నారు. ఆయన వ్యక్తిగత వ్యాపారం విలువ 50 కోట్ల వరకు ఉంటుందని ముంబయికి చెందిన ఒక ఫైనాన్సియల్ వెబ్ సైట్ పేర్కొంది. ఆయన వ్యాపారాలు మరియు ఇతర ఆస్తులు కలిపి 50 కోట్ల రూపాయలుగా నిర్థారించారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల పేరుతో భారీగానే ఆస్తులు ఉన్నాయట. వ్యక్తిగతంగా మాత్రం గౌతమ్ ఆస్తి ఖరీదు రూ.50 కోట్లుగా వారు చెప్పుకొచ్చారు.

కాజల్ అగర్వాల్ ఆస్తి గౌతమ్ ఆస్తితో పోల్చితే ఎక్కువగా ఉంటుందట. కాజల్ తన సినిమాలు మరియు కమర్షియల్ పారితోషికాలతో స్థిరాస్థిలో పెట్టుబడులు పెట్టడం మరియు ఇతర కొన్ని వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉండటం జరిగిందట. కనుక ఆమె వ్యక్తిగత ఆస్తి గౌతమ్ ఆస్తికంటే ఎక్కుగా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో కనీసం అయిదు కోట్ల వరకు సంపాదించిన కాజల్ బాగానే ఆస్తులు కూడబెట్టి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.