పూల్ లో తేలుతూ తాప్సీ ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇంట్రెస్టింగ్

0

ఇలా అయితే లాభం లేదని అనుకుందో ఏమో కానీ తాప్సీ ఇక మడికట్టుకు కూచునేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదు. ఇటీవల సోషల్ మీడియాల్లో తాప్సీ పన్ను చెలరేగిపోతోంది. సీరియస్ సోషల్ మీడియా యూజర్ ల జాబితాలో ఈ అమ్మడు చేరిపోయింది. ఈ క్వారంటైన్ లో తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో క్రమం తప్పకుండా అప్ డేట్స్ పంచుకుంది.

తాజాగా బీచ్ లో బ్లూ బికినీ లుక్ లో కనిపించి వేడెక్కిస్తోంది. బీచ్ తీరంలోని స్విమ్మింగ్ పూల్ లో తాప్సీ వయ్యారాలు వేడెక్కించేస్తున్నాయ్. నేను విరామం తీసుకుంటున్నప్పుడు.. నా సూపర్-ఎఫెక్టివ్ డైటీషియన్ జాగ్రత్తలు కొనసాగుతున్నాయి. నన్ను # రష్మి రాకెట్ కోసం కంట్రోల్డ్ డైట్ లోకి మార్చేశారు.. అని తెలిపింది తాప్సీ. రుచికరమైన గుడ్లు.. అవోకాడోలు .. మాంసకృత్తులు .. మంచి కొవ్వులతో కూడిన పుట్టగొడుగుల ఆహారం తింటున్నా. సెలవులో అల్పాహారం సెషన్ లో నాతో ఆమె జాయినవుతుంది…అని తెలిపింది.

మీ జీవితంలో సరైన వ్యక్తులు మీ కోసం ‘తేలియాడే’ వస్తువులను పంపుతారు! అంటూ ఇదిగో ఇలా పూల్ లో తేలుతున్న ఒక సపరేట్ మెనూని చూపించింది. తన విషయంలో అక్షరాలా ఈ కేరింగ్ ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీలవుతోంది. # హాలిడే # మాల్దీవులు # డైట్ ప్లాన్- తాజ్ ఎగ్జోటికా.. ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ అంటూ చాలా సంగతులే చెప్పింది తాప్సీ. కెరీర్ సంగతి చూస్తే… తాప్సీ తదుపరి విజయ్ సేతుపతి సరసన ఒక తమిళ చిత్రంలో కనిపించనుంది. మిథాలీ రాజ్ బయ్ పిక్ లోనూ ఈ భామ నటిస్తోంది. హసీన్ దిల్ రుబా అనే వేరొక చిత్రంలోనూ తాప్సీ నాయికగా నటిస్తోంది.