సత్యదేవ్ చేయాల్సిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రదీప్ వద్దకు..!

0

అలీతో సరదాగా టాక్ షోలో ప్రతి వారం ఒక సెలబ్రెటీ ఇంటర్వ్యూ వస్తుంది. వచ్చే వారం యంగ్ హీరో.. విలక్షణ నటుడు సత్యదేవ్ ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో సందడి చేస్తోంది. ప్రోమో చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు. పలు విషయాలను సత్యదేవ్ నుండి అలీ రాబట్టినట్లుగా చూపించారు. చాలా మందికి సత్యదేవ్ గురించి తెలియని విషయాలను ఆ ఎపిసోడ్ లో అలీ చూపించబోతున్నట్లుగా ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. సత్యదేవ్ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కాని జ్యోతి లక్ష్మి సినిమాతో గుర్తింపు దక్కించుకున్నాడట.

అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో సెట్ కు వెళ్లి త్రివిక్రమ్ గారిని కలిసేందుకు ప్రయత్నించగా ఆ సమయంలో నా ఫోన్ నెంబర్ తీసుకుని పంపించారు. ఆ తర్వాత చాలా రోజులు ఆయన నుండి కాల్ వస్తుందని ఎదురు చూశాను. ఇక జ్యోతిలక్ష్మి సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించగా రెండు వేల మంది వచ్చారు. అందులో నేను ఉన్నాను. వారం రోజుల తర్వాత నువ్వు చేస్తున్నావు అంటూ పూరిగారు చెప్పిన సమయంలో చాలా సంతోషం వేసింది. ఒక వ్యక్తి నాకు హీరో అయ్యే లక్షణాలే లేవు అంటూ మొహం మీదే చెప్పడంతో కసి పెరిగిందని అన్నాడు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నువ్వు చేయాల్సిన సినిమాగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో నిజం ఎంత అంటూ అలీ ప్రశ్నించగా సత్యదేవ్ నిజమే ఆ సినిమా నేను చేయాల్సిందే. కాని కొన్ని కారణాల వల్ల అంటూ వివరిస్తూ ఉండగా ప్రోమో పూర్తి అయ్యింది. వచ్చే సోమవారం నాడు ఈ విషయమై రివీల్ అయ్యే అవకాశం ఉంది. ఈటీవీలో ప్రసారం అవుతుంది. ఆ పూర్తి ఇంటర్వ్యూలో మరెన్ని విషయాలు సత్యదేవ్ గురించి తెలుస్తాయో చూడాలి.